ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSCS కృషిని అభినందించిన తానా.. కొల్లా సాకేత్ ఫౌండేషన్‌‌తో కలిసి ఆర్థిక సాయం

ABN, First Publish Date - 2022-11-17T16:44:14+05:30

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా).. అమెరికాలోని తెలుగు వాళ్లకే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని పేద ప్రజలకూ అండగా ఉంటూ ఏటా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతుంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే TANA.. మరో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా).. అమెరికాలోని తెలుగు వాళ్లకే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని పేద ప్రజలకూ అండగా ఉంటూ ఏటా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతుంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే TANA.. మరో మంచి పని చేసింది. తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరకు, ట్రెజరర్ అశోక్ కొల్లా.. తాజాగా హైదారాబాద్‌లోని TSCS (Thalasemmia and Sickle Cell Soceity)ని సందర్శించారు. తలసేమియాతో బాధపడుతున్న పేద చిన్నారులకు.. TSCS ఏ విధంగా అండగా నిలుస్తుందో... ఆ సంస్థ ఉపాధ్యక్షురాలు రత్నవళ్లిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం TSCS చేస్తున్న కృషిని అభినందించారు. ఈ క్రమంలోనే అశోక్ కొల్లా.. TSCS భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను తెలుసుకుని ప్రశంసించారు. ఆ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపించారు. ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో తానా, కొల్లా సాకేత్ ఫౌండేషన్ తరఫున.. రూ.13 లక్షల చెక్కును విరాళంగా TSCS ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు, నరేష్ రాతి, డాక్టర్ సుమన్ జైన్, డాక్టర్ అగర్వాల్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T17:36:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising