ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత ఎంబసీ అధికారులతో తెలుగు ప్రవాసీ సంఘ ప్రతినిధుల సమావేశం

ABN, First Publish Date - 2022-11-28T07:29:39+05:30

సౌదీ అరేబియాలోని ప్రవాసీ తెలుగు సంఘమైన సాటా ప్రతినిధి బృందం ఇటీవల రియాధ్‌లోని భారతీయ రాయబార అధికారవర్గాలతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియాలోని ప్రవాసీ తెలుగు సంఘమైన సాటా ప్రతినిధి బృందం ఇటీవల రియాధ్‌లోని భారతీయ రాయబార అధికారవర్గాలతో సమావేశమైంది. భారతీయ ఎంబసీలోని సీనియర్ దౌత్యవేత్త అయిన యన్.రాంప్రసాద్‌తో సాటా ప్రతినిధి బృందం సమావేశమై సంఘం చేపడుతున్న సాంస్కృతిక, సామాజిక సేవ కార్యక్రమాలను వివరించినట్లుగా సాటా ఒక ప్రకటనలో తెలిపింది.

దౌత్యవేత్తతో సమావేశమైన సాటా ప్రతినిధుల బృందంలో సంస్థ వ్యవస్ధాపక అధ్యక్షుడు మల్లేశన్, ఇద్దరు అధ్యక్షులు ఆనందరాజు, చాంద్ పర్వీన్ మరియు సలహాదారులు గీతా శ్రీనివాస్‌లు ఉన్నారు. సంస్థ కార్యకలాపాలను వివరించి దేశాభివృద్ధిలో కూడా తాము భాగస్వామ్యం అవుతామని తెలిపారు. దీంతో స్పందించిన ఎంబసీ అధికారులు.. సాటా ప్రతినిధి బృందాన్ని అభినందించినట్టు మల్లేశన్ వెల్లడించారు.

Updated Date - 2022-11-28T08:16:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising