ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాట్స్ ‘రండి రచయితలవుదాం’ కార్యక్రమానికి విశేష స్పందన

ABN, First Publish Date - 2022-11-03T18:36:13+05:30

భాషే రమ్యం.. సేవే గమ్యం’ అనే నినాదంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాలోని తెలుగు ప్రజల్లో మాతృభాషపై మరింత పట్టుపెంచేందుకు ‘రండి రచయితలవుదాం’ అనే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ‘భాషే రమ్యం.. సేవే గమ్యం’ అనే నినాదంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాలోని తెలుగు ప్రజల్లో మాతృభాషపై మరింత పట్టుపెంచేందుకు ‘రండి రచయితలవుదాం’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. కళారత్న డాక్టర్ మీగడ రామలింగస్వామి నేతృత్వంలో పద్యాలు ఎలా రచించాలనే దానిపై శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఈ పద్య రచనా శిక్షణ తరగతులకు తెలుగు వారి నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. చాలా మంది ఆన్‌లైన్‌లో ఈ శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. సొంతంగా సరళ పద్యాలను ఎలా రచించాలనే విషయాలను నేర్చుకుంటున్నారు.

పద్య రచనతో పాటు పద్య గానం ఎలా ఉండాలి..? రాగయుక్తంగా ఎలా ఆలపించాలనే విషయాలపై కూడా మీగడ రామలింగ స్వామి శిక్షణ ఇస్తున్నారు. చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడంపట్ల అమెరికాలోని తెలుగు భాష ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు భాష కోసం నాట్స్ గతంలో పద్య పోటీలు నిర్వహించిందని.. తెలుగు భాష అభివృద్ధికి తమ వంతు కృషి ఎప్పుడూ నాట్స్ చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి అన్నారు. తెలుగు భాష, సాహిత్యం భావితరాలకు అందించేందుకు నాట్స్ మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని నాట్స్ అధ్యక్షుడు బాపు చౌదరి(బాపు) నూతి పేర్కొన్నారు.

Updated Date - 2022-11-03T18:36:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising