ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NATS: సూపర్ స్టార్ కృష్ణ మృతి తెలుగుజాతికి తీరని లోటు

ABN, First Publish Date - 2022-11-16T08:11:01+05:30

ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త తమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎడిసన్, న్యూ జెర్సీ, నవంబర్ 15: ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త తమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలిపింది. మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో కృష్ణ సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారని నాట్క్ (NATS) పేర్కొంది. నటుడిగానే కాకుండా అందరికి ఆత్మీయుడిగా, నిర్మాతల నటుడిగా ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించిన కృష్ణ ఇక లేరనే విషయం జీర్ణించుకోలేనిదని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి ఓ ప్రకటనలో తెలిపారు. కృష్ట మరణ వార్త అమెరికాలో తెలుగువారందరిని కలవరపరిచిందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి పేర్కొన్నారు. కృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఇటీవల వరుసగా కృష్ణ కుటుంబంలో నలుగురు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం దురదృష్ణకరమన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated Date - 2022-11-16T08:11:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising