ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Education Fair in Kuwait: భారతీయ విద్యార్థులకు సువర్ణావకాశం

ABN, First Publish Date - 2022-11-29T08:22:54+05:30

భారతీయ విద్యార్థుల (Indian Students) కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2022ను (Higher Education Fair-2022) నిర్వహిస్తున్నట్లు ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: భారతీయ విద్యార్థుల (Indian Students) కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2022ను (Higher Education Fair-2022) నిర్వహిస్తున్నట్లు ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ వెల్లడించింది. ఈ ఫెయిర్ సల్మియా ప్రాంతంలోని భారతీయ కమ్యూనిటీ స్కూల్ సీనియర్ బ్రాంచీలో డిసెంబర్ 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఇండియాతో పాటు ఇతర దేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రవేశాలు కోరుకునే పేరెంట్స్, విద్యార్థులకు ఈ ఫెయిర్ సువర్ణావకాశం అని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. ఇక ఈ ఫెయిర్ ప్రముఖ బిజినెస్ స్కూల్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన భారత్, విదేశాలలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. వీరు ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా విద్యావకాశాలపై ఈ ఫెయిర్‌లో అవగాహన కల్పిస్తారని నిర్వాహహకులు వెల్లడించారు.

ఇక ఈ ఫెయిర్‌కు ప్లాటినం స్పాన్సర్‌లుగా మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (Manipal Academy of Higher Education), జైన్ యూనివర్సిటీ వారు వ్యహరిస్తున్నారు. అలాగే గోల్డ్ స్పాన్సర్‌లుగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ, ఎస్ఆర్ఏం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంఐటీ-వరల్డ్ పీస్ వర్సిటీ, రాజలక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజ్, డి మోంట్‌ఫోర్ట్ వర్సిటీ, దుబాయ్ బిట్స్ పిలానీ క్యాంపస్ వ్యహరిస్తుంటే.. అసోసియేట్ స్పాన్సర్‌లుగా ఆచార్య ఇన్స్‌స్టిట్యూట్, బీఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, రేవా (REVA) వర్సిటీ, పీఎస్‌జీఆర్ కృష్ణమ్మాళ్ కాలేజీ ఫర్ ఉమెన్, మహీంద్రా యూనివర్సిటీ, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్- దుబాయ్, ఎస్‌పీ జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, మిడిల్‌సెక్స్ విశ్వవిద్యాలయం, అల్గోన్‌క్విన్ కళాశాల, ఐడీపీ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్స్, అమెరికన్ వర్సిటీ ఆఫ్ కువైత్ వ్యహరిస్తున్నాయి. ఈ అవకాశాన్ని కువైత్‌లోని భారతీయ తల్లిదండ్రులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నిర్వాహకులు కోరారు.

Updated Date - 2022-11-29T08:27:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising