ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Virginia Shooting: అగ్రరాజ్యంలో మళ్లీ పేలిన తూటా.. ఈసారి కూడా భారీగానే ప్రాణ నష్టం!

ABN, First Publish Date - 2022-11-23T12:12:26+05:30

అగ్రరాజ్యం అమెరికాలో (America) మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. వర్జీనియాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో (Virginia Walmart Store) మంగళవారం ఈ కాల్పులు జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్జీనియా: అగ్రరాజ్యం అమెరికాలో (America) మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. వర్జీనియాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో (Virginia Walmart Store) మంగళవారం ఈ కాల్పులు జరిగాయి. సాయుధుడైన ఓ వ్యక్తి స్టోర్‌లోకి చోరబడి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 10 మంది వరకు చనిపోయి ఉంటారని సమాచారం. సమాచారం అందుకున్న చెసాపీక్ పోలీసులు వెంటేనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే, అప్పటికే కాల్పులకు తెగబడిన వ్యక్తి కూడా చనిపోయి ఉన్నాడు. చెసాపీక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న వాల్‌మార్ట్‌లోని మంగళవారం రాత్రి ఓ గుర్తుతెలియని దుండగుడు చొరబడ్డాడు. అనంతరం తనతోపాటు తెచ్చుకున్న తుపాకీతో స్టోర్‌లో ఉన్నవారిపై కాల్పులకు తెగబడ్డాడు. దాంతో ఒక్కసారిగా అందులో ఉన్నవారు పరుగులు పెట్టారు.

ఈ ఘటనపై అక్కడే ఉన్న ఓ వ్యక్తి 911కు కాల్‌చేసి పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో వెంటనే తాము ఘటనాస్థలికి చేరుకున్నట్లు చెసాపీక్ పోలీసులు వెల్లడించారు. అక్కడికి వచ్చేసరికి జనాలు భయాందోళనతో పరుగులు పెట్టడం కనిపించిందని చెప్పారు. లోపలికి వెళ్లే చూస్తే చాలామంది గాయాలతో ఉన్నారని, కాల్పులు జరిపిన వ్యక్తి తనను తాను కాల్చుకుని చనిపోయి ఉన్నాడని తెలిపారు. అయితే, అతడి వివరాలను మాత్రం వెల్లడించలేదు. అలాగే ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారు అనే విషయాన్ని కూడా పోలీసులు ధృవీకరించలేదు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-11-23T12:16:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising