ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat Results : ఎమ్మెల్యేగా ఎన్నికైన సతీమణిని రవీంద్ర జడేజా అభినందించిన తీరుపై సర్వత్రా...

ABN, First Publish Date - 2022-12-09T17:49:17+05:30

క్రికెటర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) తన సతీమణి రివబ జడేజా (Rivaba Jadeja)ను

Rivaba Jadeja, Ravindra Jadeja
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీ నగర్ : క్రికెటర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) తన సతీమణి రివబ జడేజా (Rivaba Jadeja)ను ట్విటర్ వేదికగా అభినందించారు. ఆమె గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో జామ్ నగర్ (ఉత్తర) నియోజవర్గం నుంచి గెలిచిన సందర్భంగా ఆమెను ‘‘హలో ఎమ్మెల్యే’’ అని సంబోధించారు. ఇది ప్రజా విజయమని తెలిపారు.

రవీంద్ర జడేజా శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘హలో ఎమ్మెల్యే... నువ్వు నిజంగా దీనికి అర్హురాలివి. జామ్ నగర్ ప్రజలు గెలిచారు. నా హృదయాంతరాళాల నుంచి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జామ్ నగర్ పనులు చాలా బాగా జరుగుతాయి’’ అని తెలిపారు.

రివబ జడేజా, రవీంద్ర జడేజా వివాహం 2016లో జరిగింది. ఆమె గతంలో కర్ణి సేన మహిళా విభాగం అధ్యక్షురాలిగా పని చేశారు. 2019లో ఆమె బీజేపీలో చేరారు. 2022 గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల రణరంగంలోకి ఆమె ప్రవేశించడం ఇదే మొదటిసారి. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కర్షణ్‌భాయ్‌పై 53,570 ఓట్ల ఆధిక్యంతో ఆమె విజయం సాధించారు.

ఇదిలావుండగా, రవీంద్ర జడేజా తండ్రి, సోదరి జామ్ నగర్ (ఉత్తర) నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. దీనిపై ఎన్నికల ప్రచార సమయంలో రివబ స్పందిస్తూ, వేర్వేరు భావాలు ఉన్నవారు వేర్వేరు పార్టీల్లో ఉండటం తప్పేమీ కాదన్నారు. తన మామ గారు వేరొక పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన ఆ పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నారని చెప్పారు. అది ఆయన వ్యక్తిగత విషయమని తెలిపారు. తనకు జామ్ నగర్ ప్రజలపై నమ్మకం ఉందని తెలిపారు.

Updated Date - 2022-12-09T17:49:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising