ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ED summons: దమ్ముంటే అరెస్ట్ చేయండి : జార్ఖండ్ సీఎం

ABN, First Publish Date - 2022-11-03T16:19:06+05:30

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ (Hemant Soren) గురువారం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు

Hemant Soren
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ (Hemant Soren) గురువారం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తాను నేరం చేసి ఉంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. అంతేకానీ తనను ప్రశ్నించేలా ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate)ను ప్రోత్సహించవద్దని చెప్పారు. చట్టవిరుద్ధ గనుల తవ్వకం కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ ఈడీ ఆయనకు సమన్లను జారీ చేసిన సంగతి తెలిసిందే. గురువారం హాజరుకావాలని సమన్లలో ఆదేశించినప్పటికీ ఆయన ఈడీ అధికారుల సమక్షంలో హాజరు కాలేదు.

హేమంత్ సొరేన్ నేతృత్వంలోని జేఎంఎం అధికార ప్రతినిధి మనోజ్ పాండే మీడియాతో మాట్లాడుతూ, ఈడీ సమన్లపై స్పందించేందుకు సొరేన్ న్యాయ సలహా తీసుకుంటున్నారని చెప్పారు. ఈడీ సమన్లకు సొరేన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారో, లేదో తనకు తెలియదని తెలిపారు.

చట్టవిరుద్ధ గనుల తవ్వకం కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ, గురువారం ఉదయం 11 గంటలకు రాంచీలోని తమ కార్యాలయంలో హాజరుకావాలని సొరేన్‌కు ఈడీ నవంబరు 1న సమన్లను జారీ చేసింది.

ఈ నేపథ్యంలో సొరేన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, తాను ఛత్తీస్‌గఢ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనవలసిన రోజునే (గురువారంనాడు) హాజరుకావాలని ఈడీ సమన్లను జారీ చేసిందన్నారు. ఈడీ కార్యాలయం వద్ద భద్రతను పెంచారన్నారు. స్థానిక జార్ఖండీలంటే భయపడుతున్నారా? అని ప్రశ్నించారు.

‘‘నన్ను ఈరోజు ఈడీ పిలిచింది. నేను ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. నేను అంత పెద్ద నేరం చేసి ఉంటే, అరెస్టు చేయండి. ప్రశ్నించడం ఎందుకు? ఈడీ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. ఎందుకు? జార్ఖండీలంటే భయపడుతున్నారా?’’ అని సొరేన్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

Updated Date - 2022-11-03T16:19:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising