Home » Hemant Soren
జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ కేబినెట్లో మంత్రిగా రామదాస్ సోరెన్ శుక్రవాం ప్రమణ స్వీకారం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌లో రామదాస్ సోరెన్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం హేమంత్ సోరెన్‌తోపాటు ఇతర కేబినెట్ మంత్రులు హాజరయ్యారు.
జేఏంఎంలో సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ కాక రేపారు. తనకు అవమానం జరిగిందని, సీఎల్పీ సమావేశం గురించి తెలియదని, సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరడంతో షాక్ తిన్నానని సోరెన వివరించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందే పార్టీ మారతానని హింట్ ఇచ్చారు. ఏ పార్టీ, ఎప్పుడు చెరతారనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. బీజేపీలో చేరతారనే ఊహాగానాలు మాత్రం జోరందుకున్నాయి.
శాసనసభ ఎన్నికల ముందు.. జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నేత, మాజీ సీఎం చంపయీ సోరెన్ ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. అధికారికంగా పార్టీకి రాజీనామా చేయడం మాత్రమే మిగిలిఉంది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ జేఏంఏంలో సీనియర్ నేత, మాజీ సీఎం చంపై సోరెన్ కాక రేపుతున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన నెలన్నర రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని, తట్టుకోలేక పోతున్నానని వివరించారు. హేమంత్ సోరెన్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను తెలిపారు.
రాజకీయాల్లో ఎప్పుడేది జరుగుతుందో ఎవరూ చెప్పలేం. జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ గుడ్‌బై చెప్పనున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నారు.బీజేపీ లీడర్లతో ప్రస్తుతం ఆయన సంప్రదింపులు జరపుతున్నారని, త్వరలోనే ఆయన కాషాయం కండువా కప్పుకోనున్నారని భోగట్టా.
సభ వ్యవహారాలకు అడ్డుపడుతున్నారనే కారణంతో 18 మంది బీజేపీ(BJP) ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి రెండ్రోజులపాటు సస్పెండ్ చేశారు. సభ నుంచి బయటకి రావడానికి ఎమ్మెల్యేలు ససేమిరా అనడంతో మార్షల్స్ వారిని ఎత్తుకుని బయటకు పంపేశారు.
గిరిజన ముఖ్యమంత్రిగా గిరిజనుల స్థితిగతులను పట్టించుకోవడానికి బదులు 'ల్యాండ్ జీహాద్', 'లవ్ జీహాద్'లను జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రోత్సహిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. దీంతో భూములు, జనాభా మధ్య సమతుల్యం దెబ్బతింటోందని చెప్పారు.
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సోమవారం ప్రఽధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోలను హేమంత్ తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
జైలు నుంచి విడుదలయ్యాక జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(CM Hemanth Sorean) సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని తొలిసారి కలిశారు. సీఎం పదవి చేపట్టాక ప్రధానితో జరిగిన తొలి సమావేశం ఇది. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మోదీని కలవడం చర్చనీయాంశం అయింది.
జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు బెయిలు మంజూరు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో సోమవారంనాడు సవాలు చేసింది. సోరెన్‌కు బెయిలు మంజూరు చేయడం చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఈడీ పేర్కొంది.