Bihar Elections: మహాకూటమికి జేఎంఏ షాక్.. ఒంటరిగానే ఆరు స్థానాల్లో పోటీ
ABN , Publish Date - Oct 18 , 2025 | 08:50 PM
బిహార్‌లోని చకాయి, ధమ్‌దాహా, కటోరియా, పీర్‌పైంతీ, మనిహారి, జముయి సీట్లలో తాము అభర్థులను నిలబెట్టనున్నట్టు జేఎంఎం ప్రకటించింది. మొత్తం ఆరు సీట్లలో జేఎంఎం పోటీ చేయాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రతినిధి సుప్రియో భట్టాచార్య తెలిపారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Polls) దగ్గరపడుతున్న వేళ విపక్ష మహాకూటమి (Mahaghatbandhan)కి జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) సారథ్యంలోని జార్ఖాండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) గట్టి షాక్ ఇచ్చింది. తమ పార్టీ ఒంటరిగా బిహార్ ఎన్నికలకు వెళ్తున్నట్టు ప్రకటించింది. విపక్ష మహాకూటిమిలో జేఎంఎం భాగస్వామ్య పార్టీగా ఉంది. మహాకూటమి సీట్ల పంపకాలపై చర్చలు కొలిక్కిరాని క్రమంలో జేఎంఎం ప్రకటన 'ఇండియా' కూటమికి, ముఖ్యంగా ఆర్జేడీకి గట్టిదెబ్బగా అంచనా వేస్తున్నారు.
బిహార్‌లోని చకాయి, ధమ్‌దాహా, కటోరియా, పీర్‌పైంతీ, మనిహారి, జముయి సీట్లలో తాము అభర్థులను నిలబెట్టనున్నట్టు జేఎంఎం ప్రకటించింది. మొత్తం ఆరు సీట్లలో జేఎంఎం పోటీ చేయాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రతినిధి సుప్రియో భట్టాచార్య తెలిపారు. 2019లో జార్ఖాండ్‌లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసిందని, మంత్రివర్గంలో ఒకరికి చోటు కూడా ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఆ తర్వాత ఎన్నికల్లోనూ ఆర్జేడీ 6 సీట్లు జేఎంఎం ఇచ్చిందని, ఆర్జేడీ నుంచి గెలిచిన వ్యక్తి ప్రస్తుత క్యాబినెట్‌లో మంచి పొజిషన్‌లో కూడా ఉన్నారని చెప్పారు. ఈసారి బీహార్‌లోని చకాయి, ధమ్‌దాహా, కటోరియా, పీర్‌పైంతీ, మనిహారి, జముయిలో తమ అభ్యర్థులను నిలబెడతామని అన్నారు.
బిహార్ ఎన్నికల్లో జార్ఖాండ్‌కు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టాలని జేఎంఎం వ్యూహంగా ఉంది. ఈ క్రమంలో జేఎంఎం స్వతంత్రంగా పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం మహాకూటమిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే వేచిచూడాలి.
ఇవి కూడా చదవండి..
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై సరైన సమయంలో నిర్ణయం
లొంగిపోయేందుకు సిద్ధం.. ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ నక్సలైట్ ఏరియా కమిటీ లేఖ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి