ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan : హిందూ మహిళ తల నరికి, చర్మం ఒలిచారు : పాకిస్థాన్ నేత

ABN, First Publish Date - 2022-12-29T13:41:47+05:30

పాకిస్థాన్‌లో హిందువులపై మతపరమైన హింసాకాండ, దాడులు అంతులేకుండా కొనసాగుతున్నాయి.

Pakistan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో హిందువులపై మతపరమైన హింసాకాండ, దాడులు అంతులేకుండా కొనసాగుతున్నాయి. ఆ దేశంలో తొలి హిందూ మహిళా సెనేటర్ కృష్ణ కుమారి తాజాగా ట్విటర్ వేదికగా వెల్లడించిన సమాచారం అత్యంత భయానకంగా ఉంది. దాదాపు 40 సంవత్సరాల వయసుగల హిందూ మహిళ దయా భెల్ తలను తెగ నరికి, ఆమె వక్షోజాలను కోసేసి, ఆమె ముఖం, శరీర భాగాల్లోని చర్మాన్ని ఒలిచారని సెనేటర్ వెల్లడించారు. ఈ సంఘటన సింఝోరో పట్టణంలో బుధవారం జరిగిందన్నారు. మృతురాలికి నలుగురు పిల్లలు ఉన్నారని తెలిపారు. సంఘటనా స్థలానికి తాను వెళ్ళానని, సింఝోరో, షాపుర్చకర్ పోలీసులు కూడా చేరుకున్నారని తెలిపారు.

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత జియాలా అమర్ లాల్ భీల్ మాట్లాడుతూ, దయా భెల్ మృతదేహాన్ని బుధవారం ఓ వ్యవసాయ భూమిలో గుర్తించినట్లు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు సమాచారాన్ని సేకరించారని, దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

Updated Date - 2022-12-29T13:41:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising