ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maddipati Venkataraju: బడుగుబలహీన వర్గాల్లో చీకట్లను తొలగించడం టీడీపీతోనే సాధ్యం

ABN, First Publish Date - 2022-11-15T17:12:22+05:30

గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు (Maddipati Venkataraju)పుట్టినరోజు వేడుకలను ద్వారకాతిరుమల మండలం ఎం. నాగులపల్లిలో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగులపల్లి (పశ్చిమగోదావరి): గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు (Maddipati Venkataraju)పుట్టినరోజు వేడుకలను ద్వారకాతిరుమల మండలం ఎం. నాగులపల్లిలో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఇటీవల మద్దిపాటి వెంకటరాజు గోపాలపురం నియోజకవర్గ టీడీపీ (Tdp) ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టాక తన పుట్టినరోజున మొదటి కార్యక్రమంగా బాదుడే బాదుడు ఎం. నాగులపల్లిలో నిర్వహించారు. ముందుగా గ్రామంలో తిరుగుతూ ప్రస్తుత ప్రభుత్వం యొక్క అసమర్థ పాలన గురించి ప్రజలకు తెలియజేశారు. అనంతరం ద్వారకాతిరుమల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లంక సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు హాజరయ్యారు. ఈ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారన్నారు. అలాగే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ... బడుగు బలహీన వర్గాల్లో చీకట్లను తొలగించడం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని, ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, అవి ప్రజలకు వివరించేందుకే బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. అనంతరం కార్యకర్తలు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి వారికి తినిపించారు. ఈ కార్యక్రమంలో భారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T17:37:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising