AP News: పూజల పేరుతో టోకరా... కేటుగాళ్ల అరెస్ట్
ABN, First Publish Date - 2022-12-07T11:21:28+05:30
జిల్లాలోని జీలుగుమిల్లి మండలం రౌతుగుడెం సమీపంలో గల కట్కూరు పునరావాస కాలనీలో పూజలు పేరుతో నిర్వాసితులకు ఇద్దరు కేటుగాళ్ళు టోకరా ఇచ్చారు.
ఏలూరు: జిల్లాలోని జీలుగుమిల్లి మండలం రౌతుగుడెం సమీపంలో గల కట్కూరు పునరావాస కాలనీలో పూజలు పేరుతో నిర్వాసితులకు ఇద్దరు కేటుగాళ్ళు టోకరా ఇచ్చారు. రెండు నెలల క్రితం కట్కూరు కాలనీలో పూజలు చేస్తామని నమ్మించి రోశయ్య, జోసెఫ్ అనే కేటుగాళ్లు దాదాపు రూ.3,20,000 వసూలు చేసి పరారయ్యారు. తిరిగి నిన్న మళ్లీ కాలనీలో ఓ కుటుంబంతో పూజలు చేస్తామని బేరమాడుతున్న కేటుగాళ్లను బాధితులు పట్టుకున్నారు. ఇద్దరిని దేహశుద్ధి చేసిన బాధితులు... వారి వద్ద నుంచి గతంలో ఇచ్చిన మొత్తంలో రూ.2,30,000 వరకు వసూలు చేసుకున్నారు. అనంతరం కేటుగాళ్లను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-12-07T11:21:30+05:30 IST