ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Purandareshwari: ఆ తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నా

ABN, First Publish Date - 2022-12-16T13:42:49+05:30

బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేసిందంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురందరేశ్వరి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేసిందంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురందరేశ్వరి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకీ అప్పటి సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం మద్యం విక్రయాలపై ఎందుకు డిజిటల్ పేమేంట్స్‌ను అమలుచేయడం లేదని ప్రశ్నించారు. విభజన హామీలను అన్నీ నెరవేరుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తాము ఏమి చెయ్యలేదనడం శోచనీయమని అన్నారు. పోలవరంకు సంబంధించి కేంద్రం హామీ ఇచ్చినట్లుగా, అన్నివిధాల రాష్ట్రానికి సహాయం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అన్నిశాఖల్లో పెద్ద ఎత్తున అవినీతి పేరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏలూరు కార్పొరేషన్‌లోని శ్మశానాల్లో రూ.5 వేల చొప్పున అంతిమక్రియలకు వసూలు చేయడం దారుణమని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-16T13:43:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising