ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandaru: ముఖ్యమంత్రికి ఉత్తరాంధ్రలో శవ రాజకీయాలేంటి?

ABN, First Publish Date - 2022-12-31T14:56:25+05:30

సీఎం జగన్‌ (Cm jagan)పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి (Bandaru Satyanarayana Murthy) మండిపడ్డారు. ‘‘నర్సీపట్నం వచ్చి ఉత్తరాంధ్రలో ఏం అభివృద్ధి చేశారో చెప్పడం మానేసి

శవ రాజకీయాలేంటి?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: సీఎం జగన్‌ (Cm jagan)పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి (Bandaru Satyanarayana Murthy) మండిపడ్డారు. ‘‘నర్సీపట్నం వచ్చి ఉత్తరాంధ్రలో ఏం అభివృద్ధి చేశారో చెప్పడం మానేసి శవ రాజకీయాలు చేస్తున్నారు. కందుకూరులో జరిగిన ఘటనను జగన్మోహన్‌రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారు. అసలు జగన్‌కు మానవత్వం ఉందా..? చంద్రబాబు (Chandrababu) సమావేశాలు చూసి జగన్‌కు భయం పట్టుకుంది. జైలుకు వెళ్లి వచ్చిన జగన్.. చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు లేదు. సుమారుగా జగన్ యాత్రలో పది మందికి పైగా చచ్చిపోయారు... ఒక్కరినైనా పరామర్శించారా? ఒకరినైనా ఆదుకున్నారా? నీ వల్ల నీ మనుషులు ఎంత మంది హత్యగావించబడ్డారు. కనీసం సాయం చేసావా? పరామర్శించావా..? భగవంతుడి మీద ఓట్టు వేసి మీ బాబాయ్ (YS. Vivekananda Reddy) హత్య నీకు తెలియదని చెప్పు. తండ్రి చనిపోతే అధికారం కోసం సంతకాలు చేయించి శవ రాజకీయం మొదలుపెట్టింది నీవుకాదా? సొంత పార్టీ ఎంపీ చనిపోతేనే పరామర్శించేందుకు వెళ్లలేదు. పరిటాల రవి (Paritala Ravi) హత్యకు కారకుడు నువ్వు కాదా? సీఐడీ (CID)ని ఉపయోగించి దొంగ కేసులు పెడుతున్నవారికి ప్రమోషన్లు ఇస్తున్నారు.’’ అంటూ బండారు ధ్వజమెత్తారు.

Updated Date - 2022-12-31T14:56:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising