ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDPJayahoBC: దేశవ్యాప్తంగా టాప్‌లో ట్రెండ్ అవుతున్న #TDPJayahoBC హ్యాష్ ట్యాగ్

ABN, First Publish Date - 2022-12-07T13:09:09+05:30

‘బీసీల అభ్యున్నతికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. వారి సంక్షేమానికి కోట్లు ఖర్చు చేస్తున్నాం’.. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తరచూ చెబుతున్న మాటలివి. కానీ.. బీసీ వర్గాలు వైసీపీ ప్రభుత్వం తమకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘బీసీల అభ్యున్నతికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. వారి సంక్షేమానికి కోట్లు ఖర్చు చేస్తున్నాం’.. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తరచూ చెబుతున్న మాటలివి. కానీ.. బీసీ వర్గాలు వైసీపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని సోషల్ మీడియా వేదికగా గొంతెత్తి చాటుతున్నాయి. బీసీలకు టీడీపీ హయాంలో ప్రవేశ పెట్టిన కార్యక్రమాలు జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని సోషల్ మీడియా వేదికగా బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ.. బీసీలకు తమ ప్రభుత్వం ‘అంత చేసింది.. ఇంత చేసింది’ అంటూ జగన్ ప్రభుత్వం ‘బీసీ గర్జన’ పేరుతో విజయవాడలో సభ నిర్వహించింది.

ఒక పక్క ఈ సభ జరుగుతుండగానే.. బీసీలకు జగన్ సర్కార్ చేసిన అన్యాయాన్ని వివరిస్తూ.. #TDPJayahoBC అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుండటం గమనార్హం. దేశవ్యాప్తంగా #TDPJayahoBC అనే హ్యాష్‌ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అయింది. టీడీపీ హయాంలో బీసీలకు జరిగిన మేలు, వైసీపీ హయాంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ #TDPJayahoBC హ్యాష్ ట్యాగ్‌ను ఐటిడిపి ట్రెండ్ చేసింది. తమకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ఆ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేస్తూ బీసీ వర్గాలు, బీసీ యువత ట్వీట్స్‌తో ట్విట్టర్‌ను హోరెత్తించింది.

ఎన్నికల ముందు ఎన్నో ఆశలు కల్పించిన వైసీపీ అధికారంలోకి రాగానే బీసీల సంక్షేమాన్ని మరచిపోయింది. గత టీడీపీ హయాంలో అందుతున్న ప్రయోజనాలను రద్దు చేసింది. నవరత్నాల పేరుతో బీసీలకు అన్యాయం చేస్తోందని ఆయా వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. యాదవ, రజక, చేనేత వృత్తి కులాలను ఈ ప్రభుత్వం మోసం చేసిందన్న భావనలో ఉన్నారు. పేదరికంలో మగ్గుతున్న యాదవులకు ప్రభుత్వం చేసింది శూన్యమని వాపోతున్నారు. రజక, నాయీ బ్రాహ్మణులకు ఆదరణ పనిముట్లను నిలిపేసి, వారి స్వయం ఉపాధి పథకాలను ఎత్తేసిందని చెబుతున్నారు. గౌడ, అగ్నికుల క్షత్రియ కులాలకు కూడా గతంలో అందుతున్న పలు పథకాలను రద్దు చేశారు. మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న జగన్‌... బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా.. విజయవాడలో జరుగుతున్న వైసీపీ బీసీ గర్జన అట్టర్ ప్లాప్ అయింది. జగన్ స్పీచ్ మొదలయ్యే సరికి సభకు హాజరైన వారు వెనుదిరిగి వెళ్లిపోతున్న దృశ్యాలు వైసీపీలో గుబులు రేపుతున్నాయి.

Updated Date - 2022-12-07T13:21:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising