AP High Court: ఏపీ హైకోర్టులో న్యాయవాదుల నిరసన
ABN, First Publish Date - 2022-12-07T18:02:49+05:30
ఏపీ హైకోర్టు (AP High Court)లో న్యాయవాదులు (Lawyers) నిరసనకు దిగారు.
అమరావతి: ఏపీ హైకోర్టు (AP High Court)లో న్యాయవాదులు (Lawyers) నిరసనకు దిగారు. ఏపీ న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ భారీ ర్యాలీ నిర్వహించింది. న్యాయమూర్తులు జస్టిస్ దేవానంద్, జస్టిస్ రమేశ్ బదిలీలను నిలుపుదల చేయాలంటూ న్యాయవాదుల డిమాండ్ చేశారు. సుప్రీం కొలీజియం నిర్ణయం వెనక్కు తీసుకోవాలని న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఏపీ హైకోర్టులో భోజన విరామ సమయంలో ప్లకార్డులతో న్యాయవాదులు నిరసనలు చేపట్టారు. ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ గవర్నర్ను కలిసి బదిలీలపై మెమొరాండం ఇచ్చింది.
Updated Date - 2022-12-07T18:04:36+05:30 IST