ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu letter to CS: మాండూస్ తుఫాను బాధిత రైతులను ఆదుకోండి...

ABN, First Publish Date - 2022-12-15T14:58:19+05:30

మాండూస్‌ తుఫాను బాధిత రైతులను ఆదుకోవాలని, ధాన్యం రైతుల సమస్యలు పరిష్కరించాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మాండూస్‌ తుఫాను (Mandour Cyclone) బాధిత రైతులను ఆదుకోవాలని, ధాన్యం రైతుల సమస్యలు పరిష్కరించాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Nara Chandrababu Naidu) డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary to the State Government)కి చంద్రబాబు లేఖ రాశారు.

లేఖలో అంశాలు:

• మాండూస్‌ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

• తుఫాను కారణంగా అనంతపురం, కడప, అన్నమయ్య, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

• వరి, అపరాలు, అరటి, బొప్పాయి, పొగాకు, పప్పు శనగ, మిరప, ప్రత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగింది.

• తుఫాను కారణంగా కోత కొచ్చిన వరి పంట నీటమునగడంతో పాటు ఆరబెట్టిన ధాన్యం తడిసింది.

• తుఫానుతో రైతులకు వేల కోట్ల నష్టం జరిగినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది.

• ధాన్యం సేకరణ లక్ష్యంలో ప్రభుత్వం భారీగా కోత విధించింది.

• ప్రభుత్వ ఆంక్షలు, కొత్త నిబంధనల కారణంగా పంటను సరైన ధరకు అమ్ముకునే పరిస్థితి లేక ధాన్యం రైతులు నానా యాతన పడుతున్నారు.

• ధాన్యంలో తేమ 17 శాతం కంటే అధికంగా ఉంటే మద్దతు ధరలో కోత కోస్తున్నారు.

• తేమ శాతం తగ్గించుకునేందుకు 20 రోజులుపైగా ధాన్యాన్ని రోడ్లపై, కళ్లాల్లో ఉంచాల్సి వస్తోంది.

• ధాన్యం ఆరబెట్టడానకి బరకాలు, టార్పాలిన్లు, కూలీల ఖర్చు రైతుకు అదనపు భారంగా మారుతుంది.

• ధాన్యం కొనుగోలుకు పరిమితులు విధించి.. దళారులకు అమ్ముకోవాలని ప్రభుత్వమే సూచించడం సరికాదు.

• వరి రైతులను గోనె సంచుల కొరత వేధిస్తోంది.

• రాయితీపై రైతులకు అందించే టార్పాలిన్‌ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం గత మూడున్నర సంవత్సరాల నుంచి నిలిపివేసింది.

• ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 1.25 లక్షల ఎకరాల్లో పొగాకు రైతులు నష్టపోయారు.

• తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు వెంటనే అన్ని జిల్లాల్లో ప్రారంభించాలి.

• తుఫానుకు నష్టపోయిన వరి, అపరాలకు ఎకరానికి రూ.20 వేలు, వాణిజ్య, ఉద్యానవన పంటలకు ఎకరానికి రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి.

• ఈ-క్రాప్‌ ఇతర నిబంధలు, ఆంక్షలు లేకుండా ఇన్యూరెన్స్‌ పరిహారం త్వరగా అందించాలి.

• కౌలు రైతులకు నేరుగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి.

• ధాన్యం రైతులు పంట నూర్చిన వెంటనే అక్కడే కొనుగోలు చేసే విధానం తీసుకురావాలి.

• ధాన్యంలో తేమ శాతంతో సంబంధం లేకుండా పంట అంతా కొనుగోలు చేయాలి.

Updated Date - 2022-12-15T14:59:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising