ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raghurama: అనంతబాబుకు బెయిల్ మంజూరుపై రఘురామ స్పందన

ABN, First Publish Date - 2022-12-12T15:28:11+05:30

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (Anantha Babu)కు సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేయడంపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (Anantha Babu)కు సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేయడంపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghuramakrishnamraju) స్పందించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్సీ ఆనంతబాబు మా పార్టీ వాడు అందుకే కాపాడుకున్నాము.. సుప్రీంకోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది.. ప్రభుత్వం ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు...అనంత బాబుకు పరిపాలకుడికి మంచి సంబంధం ఉందని బయట అనుకుంటున్నారు.. న్యాయానికి ధర్మానికి అన్యాయం జరిగిందని అనిపించినా.. మా పార్టీలో మర్డర్లు చేసినా.. ఇంకేమైనా చేసినా.. మా ప్రభుత్వ పెద్దలు రక్షించడానికి ముందుంటారు.’’ అంటూ రఘురామ వ్యాఖ్యానించారు.

కాగా సుప్రీంకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఊరట లభించింది. సోమవారం అనంతబాబుకు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతులను కింది కోర్టు విధించాలని ఆదేశాలు జారీ చేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఛార్జ్‌షీట్‌ పదే పదే ఉపసంహరించుకోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ మార్చి 14కు వాయిదా వేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి పిటిషన్‌ను విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించలేదు.

Updated Date - 2022-12-12T15:28:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising