ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: 2023లో నిజమైన హ్యాపీ న్యూయర్‌ కావాలి

ABN, First Publish Date - 2022-12-31T21:46:30+05:30

2022వ సంవత్సరం వైసీపీ (YCP) పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం జరిగింది. 2023లో అయినా ఈ ప్రభుత్వ ఆరాచకాలను పోరాటాల ద్వారా చమర గీతం పాడేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ‘‘2022వ సంవత్సరం వైసీపీ (YCP) పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం జరిగింది. 2023లో అయినా ఈ ప్రభుత్వ ఆరాచకాలను పోరాటాల ద్వారా చమర గీతం పాడేందుకు టీడీపీ (TDP) మరింత బాధ్యతో కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రజలు సైతం వైసీపీ అరాచక విధానాలపై పోరాడేందుకు సిద్ధం కావాలి.’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు. 2022కు వీడ్కోలు పలుకుతూ 2023వ సంవత్సరానికి చంద్రబాబు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు (Happy New Year) తెలిపారు. ‘‘2022 పూర్తిగా బాదుడు, విద్వేషాలు, విషాదాలు, వేధింపుల సంవత్సరంగా మిగిలిపోయింది. ప్రతి వ్యక్తి స్వేచ్ఛను కోల్పోయి శారీరకంగా, మానసికంగా, ఆర్థిక క్షోభను అనుభవించారు. ప్రభుత్వ విధ్వంసాలకు ప్రతిపక్ష పార్టీలతోపాటు ప్రజలు బాధితులుగా మారారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే పోలీసుల ద్వారా శారీరకంగా హింసించారు. కొంతమంది పోలీసులు రౌడీల్లా దాడులు చేశారు. ప్రతిపక్ష పార్టీల పైనా దాడులు చేశారు. అమాయక ప్రజలపైనా దాడులు చేశారు. ఆ దాడులతో వీరు పైశాచిక ఆనందాన్ని పొందారు. రైతుల అప్పుల్లో దేశంలోనే రాష్ట్రం నంబర్‌ వన్‌గా నిలిచింది. రైతుల ఆత్మహత్యల్లోనూ రాష్ట్రానికి మూడో స్థానం. మూడున్నరేళ్ల కాలంలో 1673 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనేది అధికారిక లెక్కలు. రికార్డు కాని మరణాలు మూడు, నాలుగు రెట్లు ఎక్కువ. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు, దళారులు, అధికారులు కుమ్మకై కోట్ల రూపాయల రైతు కష్టాన్ని మింగేశారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated Date - 2022-12-31T21:46:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising