ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Piduguralla: మీది పల్నాడు జిల్లానా.. హైదరాబాద్‌లో గానీ, బెంగళూరులో గానీ ఉంటున్నారా.. విషయం ఏంటంటే..

ABN, First Publish Date - 2022-11-14T11:59:22+05:30

పల్నాడులోని (Palnadu) ప్రధానమైన బస్టాండ్లలో పిడుగురాళ్ల (Piduguralla) ఒకటి. అయితే ఈ ప్రాంత వాసులు సుదూర ప్రయాణం చేసే సౌకర్యం అందుబాటులో లేదు. పిడుగురాళ్ల ఆర్టీసీ డిపో (Piduguralla RTC Bus Stand) ఒకప్పుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిడుగురాళ్ల: పల్నాడులోని (Palnadu) ప్రధానమైన బస్టాండ్లలో పిడుగురాళ్ల (Piduguralla) ఒకటి. అయితే ఈ ప్రాంత వాసులు సుదూర ప్రయాణం చేసే సౌకర్యం అందుబాటులో లేదు. పిడుగురాళ్ల ఆర్టీసీ డిపో (Piduguralla RTC Bus Stand) ఒకప్పుడు వేలాది మంది ప్రయాణికులను రాష్ట్రంలోని పలు గమ్య స్థానాలకు చేర్చి ప్రయాణికుల మన్ననలు పొందిన డిపో నేడు గడపదాటని సర్వీసులా తయారైంది. పిడుగురాళ్ల డిపోలో 47 ఆర్టీసీ, 18 అద్దె బస్సులుండగా వాటిల్లో ఎక్కువ భాగం లోకల్‌ ట్రిప్పులతోనే సరిపెడుతున్నారు. ఒకప్పుడు బెంగళూరు (bangalore), తిరుపతి (tirupati), విశాఖపట్నం (visakhapatnam), కాకినాడ (Kakinada), హైదరాబాద్‌ (Hyderabad) ప్రాంతాలకు రాకపోకలు సాగించిన బస్సులన్నీ కొన్నాళ్లుగా నిలిచిపోయాయి.

విజయవాడ (Vijayawada), గుంటూరు (Guntur), నరసరావుపేట (Narasaraopet), మాచర్ల (Macherla), కారంపూడి (Karampudi), క్రోసూరుతో (Krosuru) పాటు మరికొన్ని పల్లెలకు మాత్రమే బస్సులు తిరుగుతున్నాయి. పల్లె వెలుగు బస్సులతో పెద్దగా ఆదాయం లేకపోయినా బస్సులు తిప్పుతున్నారు. ఆర్టీసీ అధికారుల తీరుతో దూర ప్రాంతాలకు ప్రయాణించే వారంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పుణ్యక్షేత్రాల మాటే లేదు..

గురజాల, పిడుగురాళ్ల డిపోల నుంచి పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శ్రీశైలం వరకు కూడా బస్సులు నడిచే పరిస్థితి లేదు. ఒకప్పుడు శ్రీశైలం, తిరుపతికి తిరిగిన బస్సులన్నీ అధికారులు నిలిపివేశారు. అంతేకాకుండా బెంగళూరు సర్వీసుకు మంచి ఆదరణ ఉన్నా ఎందుకనో ఆ సర్వీసును కూడా నిలిపివేశారు. బెంగళూరు ఐటీ రంగంలో పిడుగు రాళ్ల, గురజాల, మాచవరం ప్రాంతాల నుంచే వందలాది మంది స్థిరపడి ఉన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో సమీపం నుండే బెంగళూరుకు రోజూ రెండు సర్వీసులను ప్రైవేటు బస్సులు తిరుగుతున్నా ఆర్టీసీ అధికారులు మాత్రం ఉన్న ఒక్క బస్సు కూడా తీసివేశారు. దీంతో పిడుగురాళ్ల నుంచి బెంగళూరు వెళ్లే ఐటీ రంగానికి చెందిన వారి కోసం రెండు ప్రైవేటు బస్సులను నడుపుతున్నారు.

Updated Date - 2022-11-14T12:13:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising