ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాచర్లలో ఉద్రిక్తత.. టీడీపీ వాహనాల ధ్వంసం..పట్టించుకొని పోలీసులు..

ABN, First Publish Date - 2022-12-16T20:48:18+05:30

మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ (TDP) నేత జూలకంటి బ్రహ్మారెడ్డి, టీడీపీ శ్రేణులపై వైసీపీ (YCP) కార్యకర్తలు దాడి చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు: పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ (TDP) నేత జూలకంటి బ్రహ్మారెడ్డి, టీడీపీ శ్రేణులపై వైసీపీ (YCP) కార్యకర్తలు దాడి చేశారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో జూలకంటి పాల్గొన్నారు. వార్డుల్లో తిరుగుతున్న టీడీపీ నేతలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. మాచర్లలో టీడీపీ వాహనాలను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. వైసీపీ శ్రేణుల దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నా మాచర్ల పోలీసులు చోద్యం చూస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మారెడ్డి, టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు పాశవికంగా దాడికి పాల్పడ్డారు. పార్టీ కార్యాలయం, టీడీపీ నేతల ఇళ్లు, వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ నేత బ్రహ్మారెడ్డి ఇంటికి, టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్త, సానుభూతిపరుల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పెట్రోల్ పోసి ఫర్నీచర్ తగులబెట్టారు. మాచర్లలో తీవ్ర అరాచకం సృష్టించిన వైసీపీ మాచర్ల టీడీపీ ఆఫీస్‌కు సైతం పెట్టింది. టీడీపీ నేతలను చంపేందుకు బండరాళ్లు, కర్రలతో వైసీపీ ప్రయత్నించింది. మాచర్లలో భారీగా పోలీసులు మోహరించారు. నిమ్మకు నీరెత్తినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. మాచర్లలో భయాందోళన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు దుకాణాలను మూయించేశారు. మాచర్ల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

Updated Date - 2022-12-16T22:21:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising