ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Atchannaidu: వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించింది

ABN, First Publish Date - 2022-11-30T11:14:04+05:30

మూడున్నరేళ్ల వైసీపీ పాలన (Ycp Government)లో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించి విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేశారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా ఆయన జగన్

భ్రష్టుపట్టించారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మూడున్నరేళ్ల వైసీపీ పాలన (Ycp Government)లో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించి విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేశారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా ఆయన జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘విద్యా దీవెన కాదు జగన్ రెడ్డి విద్యార్థులకు దగా దీవెన. టీడీపీ ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు అందిస్తే జగన్ రెడ్డి(Cm jagan) ప్రభుత్వం 11 లక్షల మందికి అందించి 5 లక్షల మంది విద్యార్థులకు విద్యా దీవెన కోత విధించింది. మోసకారి సంక్షేమం పేరుతో గోరంత ఇచ్చి కొండంత ప్రచారం. 2021-22లో 4వ క్వార్టర్‌ నగదు విడుదల చేయకపోవడంతో యాజమాన్యం విద్యార్థులను పరీక్షలు రాయనివ్వడం లేదు. ఒక్క విద్యా దీవెనకే ఏడాదికి రూ.20 కోట్లు చొప్పున 5 ఏళ్లకు రూ.100 కోట్లు ఒక్క సాక్షి పేపర్‌కే ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు. పీజీ విద్యార్థులకు విద్యాదీవెన నిలిపివేసి బడుగు బలహీన వర్గాలకు ఉన్నత చదువులు దూరం చేశారు. టీడీపీ అమలు చేసిన విదేశీ విద్య, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, ఎన్టీఆర్ విద్యోన్నతి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి పథకాలు రద్దు చేసి విద్యార్థులకు ద్రోహం.’’ చేశారంటూ జగన్‌ సర్కార్‌పై అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Updated Date - 2022-11-30T11:14:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising