హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లే వారికి Air India గుడ్‌న్యూస్!
ABN, First Publish Date - 2021-09-11T13:54:46+05:30
లండన్-హైదరాబాద్ మధ్య డైరెక్ట్ విమాన సర్వీసుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు ఎయిర్ ఇండియా తీపి కబురు చెప్పింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు నాన్‌స్టాప్ విమాన సర్వీసును ప్రారంభించింది. వారంలో రెండు రోజులు.. శుక్ర, సోమవారాల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి లండన్‌కు డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభం
హైదరాబాద్: లండన్-హైదరాబాద్ మధ్య డైరెక్ట్ విమాన సర్వీసుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు ఎయిర్ ఇండియా తీపి కబురు చెప్పింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు నాన్‌స్టాప్ విమాన సర్వీసును ప్రారంభించింది. వారంలో రెండు రోజులు.. శుక్ర, సోమవారాల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి యూకేలోని హీత్రో విమానాశ్రయానికి శుక్ర, సోమవారాల్లో ఈ విమాన సేవలు ఉంటాయి. ఇక తొలి విమానం శుక్రవారం ఉదయం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు వెళ్లింది. ఎయిరిండియా విమానం ఏఐ-147 శుక్రవారం ఉదయం 5.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరింది.
ఇవి కూడా చదవండి..
అంగరంగ వైభవంగా NRI పెళ్లికి డెకరేషన్.. మధ్యలో షాకిచ్చిన కోర్టు..
ఈ America రాష్ట్రాల్లో Income Tax కట్టాల్సిన పనిలేదు.. కానీ..
హైదరాబాద్ నుంచి బయల్దేరిన తర్వాత కేవలం తొమ్మిది గంటల్లో లండన్‌లో ఉండొచ్చు. మన దగ్గర ఉదయం 5.30 గంటలకు వెళ్తే.. లండన్‌కు ఉదయం 11.30 గంటలకు(బ్రిటన్ కాలమానం ప్రకారం) చేరుకోవచ్చు. అలాగే సోమవారం తెల్లవారుజామున 1.30 గంటలకు శంషాబాద్ నుంచి బయల్దేరే ఎయిర్ ఇండియా విమానం 147.. హీత్రో విమానాశ్రయానికి ఉదయం 7.30 గంటలకు(బ్రిటన్ కాలమానం ప్రకారం) చేరుకుంటుంది. అదే రోజు రిటర్న్ విమానం ఏఐ-148 లండన్ నుంచి ఉదయం 9.45 గంటలకు(బ్రిటన్ కాలమానం ప్రకారం) బయల్దేరుతుంది. హైదరాబాద్‌కు రాత్రి 11.35 గంటలకు చేరుకుంటుంది.
ఈ సందర్భంగా జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ పానిక్కర్ మాట్లాడుతూ.. "భారతీయులకు యూరప్ అత్యంత ఇష్టమైన గమ్యస్థానం. లండన్‌కు నాన్‌స్టాప్ ఎయిర్ ఇండియా విమాన సర్వీస్ అనేది యూరోప్‌కు అతుకులు లేని ఎయిర్ కనెక్టివిటీని కల్పిస్తుంది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ కొత్త రూట్ లండన్‌లోని విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, రాబోయే సంవత్సరాల్లో వ్యాపారాలు, ఎంఐసీఈ ప్రయాణికులకు అవకాశాలను విస్తరించడానికి సహాయపడుతుంది. ఎయిరిండియా విమానానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు సమీప రాష్ట్రాల ప్రజల నుండి మంచి డిమాండ్ ఉంటుందని మేము ఆశిస్తున్నాము" అని అన్నారు.
Updated Date - 2021-09-11T13:54:46+05:30 IST