ఈ America రాష్ట్రాల్లో Income Tax కట్టాల్సిన పనిలేదు.. కానీ..

ABN , First Publish Date - 2021-09-11T04:06:55+05:30 IST

జనాలు కోట్లు కూడబెట్టుకుంటున్నారు. కానీ ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం లేదు. కానీ అక్కడి ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం..

ఈ America రాష్ట్రాల్లో Income Tax కట్టాల్సిన పనిలేదు.. కానీ..

జనాలు కోట్లు కూడబెట్టుకుంటున్నారు. కానీ ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం లేదు. కానీ అక్కడి ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అయితే అక్కడి జనాలు ప్రభుత్వాన్ని మోసం చేయడం లేదు. ప్రభుత్వాలేమీ అవినీతిమయం కాలేదు. నిజానికి అక్కడి ప్రజల నుంచి ప్రభుత్వాలు నయా పైసా కూడా పన్ను వసూలు చేయవు. ఆశ్చర్యంగా ఉందా..? కానీ ఇది నిజం. అయితే ఇది ఇండియాలో కాదు.. అమెరికాలో. 

అమెరికాలోని మొత్తం 9 రాష్ట్రాలు పూర్తిగా పన్ను రహితంగా ఉన్నాయి. అక్కడి ప్రజలు ప్రభుత్వాలకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ రాష్ట్రాల గురించి తెలుసుకుందాం.


1. అలస్కా:

అమెరికాలో అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం అలాస్కా. ఎలాంటి ఇన్‌కం ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్‌లను ప్రజలు చెల్లించాల్సిన పనిలేదు. అంతేకాదు అమెరికాలోని మొత్తం రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడే అత్యంత తక్కువ శాతం పన్నులను ప్రజలు చెల్లిస్తారు. అలాస్కాలో నివశించే ప్రజలు ఒక్కొక్కరి తలసరి సంపాదనలో ఇన్‌కం, ప్రాపర్టీ, సేల్స్, ఎక్సైజ్ ట్యాక్స్‌లన్నీ కలిపి కేవలం 5.16 శాతం మాత్రమే ఉంటాయి. అయితే అలాస్కాలో కాస్ట్ ఆఫ్ లివింగ్(నివాస వ్యయం) మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఆ రాష్ట్రం మిగతా అమెరికాతో సంబంధం లేనట్లు ఓ మూలన ఉండడమే.


2. ఫ్లోరిడా:

ఫ్లోరిడాలో చాలా మంది సీనియర్ సిటిజన్స్, వివిధ వృత్తుల్లో పనిచేసి రిటైర్ అయిన వారు ఇక్కడ నివశిస్తుంటారు. ఈ రాష్ట్రంలో సేల్స్, ప్రాపర్టీ ట్యాక్స్‌లు జాతీయ సగటుకు కొంత ఎక్కువగా మాత్రమే ఉంటాయి. కానీ మొత్తంగా చూస్తే మాత్రం ప్రజల తలసరి ఆదాయంలో కేవలం 6.82 శాతం మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ మాత్రం సాధారణ స్థాయికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అమెరికాలో నివశించేందుకు అనువుగా ఉండే రాష్ట్రాల ర్యాంకుల్లో మాత్రం ఫ్లోరిడాకు 13వ ర్యాంకు ఉంది. 


3. నెవాడా:

నెవాడా ప్రభుత్వం అత్యధిక సేల్స్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. నిత్యావసరాలు, దుస్తులు, మద్యం, జూదం, కసీనోస్, హోటల్స్ వంటి వాటిపై అత్యధికంగా పన్నులు వసూలు చేస్తూ ఉంటుంది. దీంతో ఇక్కడి ప్రజల తలసరి ఆదాయంతో పోల్చితే పన్నుల శాతం 8.39 శాతంగా ఉంటుంది. ఇక కాస్ట్ ఆఫ్ లివింగ్‌ విషయానికి వస్తే.. అమెరికాలోని అత్యంత ఖరీదైన నగరాల్లో నెవాడా ఒకటి. ఈ విషయంలో మొత్తం 50 రాష్ట్రాల్లో నెవాడాకు 42వ స్థానం దక్కింది. 


4. సౌత్ డకోటా:

ఈ జాబితాలోని మిగిలిన రాష్ట్రాలలానే సౌత్ డకోటా కూడా ప్రజల నుంచి పన్నులను వసూలు చేయదు. అయితే వ్యసనాలైన సిగరెట్లు, మద్యంపైనే ఇక్కడి ప్రభుత్వం ట్యాక్స్ విధించింది. అయితే ఈ రాష్ట్రంలోని లకోటా సియోక్స్, బ్రాక్ హిల్స్ ప్రాంతాల్లో సగటు ప్రాపర్టీ ట్యాక్స్ కంటే ప్రభుత్వం అత్యధికంగా వసూలు చేస్తుంది. కానీ ఇక్కడి సేల్స్ ట్యాక్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులకు ఈ రాష్ట్రంలో ట్యాక్స్ విషయంలో చాలా ప్రయోజనాలు లభిస్తాయి. ఇక్కడ ప్రజల తలసరి ఆదాయంతో పోల్చితే వారు చెల్లించే ట్యాక్స్‌లు కేవలం 7.86 శాతం మాత్రమే ఉంటాయి.


5. టెక్సాస్:

అమెరికాలోని టెక్సాస్ కూడా ప్రజల నుంచి పన్నులను వసూలు చేయదు.  సేల్స్, ఎక్సైజ్ ట్యాక్స్‌లపైనే టెక్సాస్ ఎక్కువగా ఆధారపడుతుంది. ఇక్కడి కొన్ని ప్రాంతాల్లో సేల్స్ ట్యాక్స్ అత్యధికంగా 8.25శాతం ఉంటుంది. దీనికి తోడు సేవలు, మౌలిక వసతుల కోసం కూడా ఇక్కడి ప్రజలు కొంత చెల్లించాల్సి ఉంటుంది.


6. వాషింగ్టన్:

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ కూడా ట్యాక్స్ ఫ్రీ రాష్ట్రమే. వాషింగ్టన్‌లో అంతా యువతరం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అనేక సంస్థలు, కంపెనీలు కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్‌ ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే వాషింగ్టన్‌లో గ్యాసోలీన్ ధరలు అత్యధికంగా ఉంటాయి. ప్రజల తలసరి ఆదాయంతో పోల్చితే ఇక్కడి ట్యాక్స్‌ చెల్లింపు శాతం 8.32 శాతంగా ఉంటుంది. ఇక కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయానికి వస్తే అమెరికాలోని అత్యంత ఖరీదైన రాష్ట్రాల జాబితాలో వాషింగ్టన్‌ 7వ ర్యాంకులో ఉంటుంది.


7. వ్యోమింగ్:

వ్యోమింగ్‌ రాష్ట్రంలో జనసాంద్రత చాలా తక్కువ. అమెరికాలో ఇంత తక్కువ జనసాంద్రత కలిగిన రెండో రాష్ట్రం వ్యోమింగ్. మొదటి స్థానంలో అలాస్కా ఉంది. ఇక్కడి ప్రజలు ఎలాంటి పర్సనల్, కార్పొరేట్, ఇన్‌కం ట్యాక్స్‌లను చెల్లించాల్సిన పనిలేదు. అలాగే రిటైర్మెంట్ లభించే సొమ్ముకు కూడా ఎలాంటి ఇన్‌కం ట్యాక్స్ చెల్లించాల్సిన పనిలేదు. అలాగే ఇక్కడ ప్రాపర్టీ, సేల్స్ ట్యాక్స్ చెల్లింపులు చాలా తక్కువగా ఉంటాయి. అయితే అలాస్కాలానే వ్యోమింగ్ కూడా సహజ వనరులపై పన్నులు వసూలు చేస్తుంది. ఇక్కడి ప్రజల తలసరి ఆదాయంతో పోల్చితే మొత్తం ట్యాక్స్ చెల్లింపులు కేవలం 6.47 శాతం మాత్రమే ఉంటాయి.


8. టెన్నెస్సీ:

2016కు ముందు పెట్టుబడులు, వడ్డీలు, డివిడెండ్లపై టెన్నెస్సీ పన్నులు వసూలు చేసేది. అయితే అదే ఏడాది తీసుకొచ్చిన చట్టం ద్వారా ట్యాక్స్‌లను తగ్గించారు. అయితే టెన్నెస్సీలో సేల్స్‌ ట్యాక్స్‌తో పాటు బీర్‌పై కూడా ట్యాక్స్‌ అత్యధింకగా ట్యాక్స్ వసూలు చేస్తుంది. టెన్నెస్సీలోని ప్రజల తలసరి ఆదాయంతో పోల్చితే ఇక్కడి ట్యాక్స్ శాతం 6.18శాతంగా ఉంటుంది.


9. న్యూ హాంప్షైర్:

జీతాలు, వేతనాలపై న్యూ హాంప్షైర్‌లో ట్యాక్సులు చెల్లించాల్సిన పనిలేదు. అలాగే ఇక్కడ సేల్స్ ట్యాక్స్ లేదు. కానీ మద్యం వంటి వాటిపై ఎక్సైజ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ దేశంలోనే అత్యధికంగా  ఉంటుంది. సగటున 2.2 శాతం ప్రాపర్టీ ట్యాక్స్‌ను ఇక్కడి ప్రజలు చెల్లిస్తుంటారు.


అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లోని ట్యాక్స్ చెల్లింపుల స్థాయి, మిగతా రాష్ట్రాలతో పోల్చితే వాటి శాతం, కొనుగోలు సామర్థ్యం, నివాస యోగ్యమైన రాష్ట్రం వంటి అంశాలకు సంబంధించిన వివరాలు కూడా ఈ కింద ఉన్నాయి.  




మరి విషయం తెలిసిన తర్వాత అమెరికాలోని ఆ రాష్ట్రాలకు వెళ్లాలని అనుకుంటున్నారు కదూ. అయితే ఓ సారి మీ పాస్ పోర్ట్, వీసా సెట్ చేసుకుని బయల్దేరండి. ఇక ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నివశిస్తున్న వారైతే ఈ బెన్‌ఫిట్స్‌తో మీరు హ్యాపీగా ఉన్నట్లే.

Updated Date - 2021-09-11T04:06:55+05:30 IST