Trump Oath Ceremony: ప్రమాణస్వీకారంలో.. ట్రంప్ కుమార్తెతో కలిసి సందడి చేసిన తెలుగమ్మాయి..
ABN, Publish Date - Jan 21 , 2025 | 04:02 PM
అమెరికాకు 47వ అధ్యక్షుడిగా రాజధాని వాషింగ్టన్ డీసీలో (జనవరి 20) నిన్న ప్రమాణస్వీకారం చేశారు డొనాల్డ్ ట్రంప్. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరందరిలో ట్రంప్ భార్య మెలానియా, కుమార్తె ఇవాంకాలతో పాటు తెలుగమ్మాయి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‍గా నిలిచారు..
ట్రంప్ అధ్యక్ష ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఇవాంకా ట్రంప్‌తో కలిసి సందడి చేసిన తెలుగమ్మాయి.
యుఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఐవరీ బ్లౌజ్, పెన్సిల్ స్కర్ట్, వాటి పైన నేవీ బ్లూ డబుల్ బ్రెస్ట్ కోటు, అదే రంగుగల హ్యాట్, చిన్నపాటి డైమంట్ చెవిపోగులు ధరించి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. సింపుల్ లుక్స్‌తో అందరినీ ఆకర్షించారు.
తండ్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఇవాంకా ట్రంప్ ముదురు ఆకుపచ్చ పెన్సిల్ స్కర్ట్, అదే రంగు గల జాకెట్ ధరించారు. బ్లాక్ బెల్ట్, గ్లౌస్, హీల్స్, గ్రీన్ హ్యాట్ ఆమెకు కంప్లీట్ లుక్ తీసుకొచ్చాయి.
తండ్రి ప్రమాణస్వీకారోత్సవంలో ఫ్లోర్ లెంగ్త్ నేవీ వెల్వెట్ కోట్ డ్రెస్, మినిమల్ జ్యువెలరీ ధరించి అదిరిపోయే లుక్స్‌తో ఆకట్టుకున్నారు టిఫనీ ట్రంప్.
పర్పుల్ కలర్ ఔట్‌ఫిట్ ధరించి జిల్ బైడెన్ కాబోయే అధ్యక్షుడిని, వారి కుటుంబాన్ని ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు.
యూఎస్ రెండో మహిళ హోదాలో ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు తెలుగు మహిళ ఉషా వాన్స్. టీ లెంగ్త్ పింక్ కలర్ క్యాష్‌మెర్ కోట్, స్కార్ఫ్, ఫ్లోరల్ ఈయర్ రింగ్స్, స్లీక్ బన్ హెయిర్ స్టైల్‌తో కనిపించి వావ్ అనిపించారు. ఈమె భర్త జేడీ వాన్స్ కూడా ఇదే కార్యక్రమంలో ఉపాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు.
Updated Date - Jan 21 , 2025 | 04:02 PM