ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ గడ్డలతో గర్భానికి చేటు ఏ మేరకు?

ABN, Publish Date - Mar 06 , 2025 | 05:57 AM

డాక్టర్‌! నా వయసు 28 సంవత్సరాలు. గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని స్కానింగ్‌లో తెలిసింది. వీటి వల్ల గర్భం వచ్చే అవకాశాలు తగ్గుతాయా? ఒకవేళ గర్భం ధరిస్తే,...

కౌన్సెలింగ్‌

ఆ గడ్డలతో

గర్భానికి చేటు ఏ మేరకు?

డాక్టర్‌! నా వయసు 28 సంవత్సరాలు. గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని స్కానింగ్‌లో తెలిసింది. వీటి వల్ల గర్భం వచ్చే అవకాశాలు తగ్గుతాయా? ఒకవేళ గర్భం ధరిస్తే, సమస్యలేవైనా ఎదురవుతాయా?

- ఓ సోదరి, హైదరాబాద్‌

చిన్నపాటి ఫైబ్రాయిడ్‌ గడ్డలతో గర్భం దాల్చే అవకాశాలకు ఎలాంటి అవరోధం ఉండదు. సాధారణంగా ఫైబ్రాయిడ్‌ గడ్డలు చిన్నవిగా ఉంటాయి. పైగా వాటి వల్ల గర్భసంచి పరిమాణం తగ్గడం, ఫెలోపియన్‌ ట్యూబులకు అడ్డంకులు ఏర్పడడం ఎంతో అరుదు. అయితే ఇవే గడ్డలు పరిమాణంలో పెద్దవిగా ఉన్నా, లోపలి వైపుకు పెరుగుతున్నా, గర్భధారణలో ఇబ్బందులు తలెత్తవచ్చు. కొన్నిసార్లు గడ్డలు గర్భసంచి పైవైపు ఒక మూలలో పెరగవచ్చు. వాటి వల్ల ఫెలోపియన్‌ ట్యూబులో అవరోధాలు ఏర్పడి గర్భఽధారణ సమస్యలు తలెత్తవచ్చు. కొన్ని సందర్భాల్లో పెద్ద ఫైబ్రాయిడ్‌ గడ్డల వల్ల, గర్భస్రావం జరగడం, నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం లాంటివి కూడా జరగవచ్చు.


ఫైబ్రాయిడ్స్‌తో గర్భం దాల్చినప్పుడు గడ్డలకు రక్తప్రసరణ పెరిగి వాటి పరిమాణం కూడా పెరిగి బాధ, అసౌకర్యం వేధించవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆస్పత్రిలో చేరి నొప్పినివారణ చికిత్స తీసుకోవలసి వస్తుంది. ఫైబ్రాయిడ్స్‌ గర్భసంచి కింది భాగంలో పెరిగితే, గర్భాశయంలో బిడ్డ అడ్డంగా లేదా తలకిందులుగా పెరిగి, సిజేరియన్‌ సర్జరీ చేయవలసి వస్తుంది. ఈ గడ్డల వల్ల సర్జరీ సమయంలో అధిక రక్తస్రావం జరిగే సమస్య కూడా ఉంటుంది. మీ విషయంలో థైరాయిడ్‌ గడ్డలు పెద్దవిగా ఉన్నా, లోపలి వైపు పెరుగుతున్నా లేదా వాటి వల్ల నెలసరిలో తీవ్ర రక్తస్రావం అవుతున్నా, నొప్పి వేధిస్తున్నా, సర్జరీతో ఫైబ్రాయిడ్స్‌ను తొలగించుకోవాలి. సర్జరీ జరిగిన ఆరు నెలల తర్వాత పిల్లల కోసం ప్రయత్నిస్తే, ఫైబ్రాయిడ్స్‌ తాలూకు ఇబ్బందులు తగ్గుతాయి. త్వరగా కోలుకోవడం కోసం కోత లేని కీహోల్‌ పద్ధతిలో, ల్యాప్రోస్కోపిక్‌ సర్జరీ చేయించుకోవడం ఉత్తమం.

డాక్టర్‌ ప్రమత శిరీష

కన్సల్టెంట్‌ అబ్‌స్టెట్రీషియన్‌,

గైనకాలజీ, ల్యాప్రోస్కోపిక్‌ సర్జన్‌ అండ్‌

ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌,

బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో, హైదరాబాద్‌.


Updated Date - Mar 06 , 2025 | 05:57 AM