ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cleaning Tips: గోడల మురికి పోవాలంటే...

ABN, Publish Date - Feb 18 , 2025 | 11:50 PM

గోడలు ప్రకాశవంతంగా ఉన్నప్పుడే ఇల్లు అద్దంలా మెరుస్తుంది. ఇంటి గోడలను పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం.

కాలక్రమేణా దుమ్ము, ధూళి పేరుకుని గోడలు కాంతివిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంట్లో బూజు దులిపి ఫ్లోర్‌ శుభ్రం చేసేటప్పుడు గది గోడలను కూడా పరిశీలించాలి. మైక్రోఫైబర్‌ వస్త్రం లేదా మెత్తని స్పాంజ్‌తో గోడలను పై నుంచి కింది వరకు సున్నితంగా తుడవాలి. వారానికి ఒకసారి మెత్తని చీపురుతో గోడలను తుడిచినా ప్రయోజనం ఉంటుంది. గోడలను నీళ్లతో తడపకూడదు.

ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో గోడలపై తరచూ వేలిముద్రలు, చేతి గుర్తులు, ఆహార పదార్థాల మరకలు పడుతుంటాయి. ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు పోసి ఒక చెంచా డిష్‌ వాషింగ్‌ లిక్విడ్‌ వేసి బాగా కలపాలి. ఇందులో ఒక స్పాంజ్‌ని ముంచి దానితో మరకలపై మెల్లగా రుద్ది తుడవాలి.

ఇంట్లో తేమ ఎక్కువగా ఉంటే గోడల రంగు మారడమే కాకుండా మూలల్లో బూజు చేరుతుంది. వంటగది, వాష్‌రూమ్‌ సహా అన్ని గదుల్లో వెంటిలేషన్‌ సరిగా ఉండేలా చూసుకోవాలి. గాలి లోపలికి వీచేలా ఏర్పాటు చేసుకోవాలి.


ఎండ నేరుగా ఇంటిలోపలికి వస్తూ ఉంటే దాని వల్ల గోడల రంగు వెలిసిపోయే అవకాశం ఉంటుంది. అధిక వేడిని నివారించేందుకు కిటికీలకు కర్టెన్లు వేయడం మంచిది.

హాల్‌, స్టడీ రూమ్‌, లివింగ్‌ రూమ్‌ గోడలపై తరచూ తాకే ప్రదేశాలు మురికిగా మారుతుంటాయి. గోడలకు వేసిన పెయింటింగ్‌లకు సంబంధించి చిన్న డబ్బాలు తెచ్చి పెట్టుకుని అప్పుడప్పుడు టచప్‌ ఇస్తూ ఉంటే సమస్య పరిష్కారమవుతుంది.

చిన్న పిల్లలున్న ఇళ్లల్లో గోడలపై కలర్‌ పెన్సిల్స్‌, స్కెచ్‌లు, ఇతర రంగుల మరకలు, గీతలు కనిపిస్తూంటాయి. అలా చేయకుండా ఉండాలంటే వైట్‌ బోర్డును గోడకి ఏర్పాటు చేసి దాన్ని ఉపయోగించేలా నచ్చజెప్పాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

Rahul Gandhi: అర్ధరాత్రి నిర్ణయం సరికాదు... సీఈసీ ఎంపికపై రాహుల్

Bengaluru: బెంగళూరులో తాగు నీటిని ఇతర అవసరాలకు వాడితే భారీ జరిమానా

Mahakumbh: 26న చిట్టచివరి స్నాన ఘట్టం... హై అలర్ట్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2025 | 11:50 PM