ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pregnancy Diet: గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా...

ABN, Publish Date - Jan 21 , 2025 | 03:28 AM

కడుపు నిండా తినలేని చిత్రమైన పరిస్థితిని గర్భిణులు ఎదుర్కొంటూ ఉంటారు. కొద్దిపాటి భోజనంతోనే పొట్ట నిండిపోతూ ఉంటుంది.

కడుపు నిండా తినలేని చిత్రమైన పరిస్థితిని గర్భిణులు ఎదుర్కొంటూ ఉంటారు. కొద్దిపాటి భోజనంతోనే పొట్ట నిండిపోతూ ఉంటుంది. కాబట్టి తీసుకునే కొద్దిపాటి ఆహారం పోషకభరితంగా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం ఈ నియమాలు పాటించాలి.

గర్భిణి సాధారణం కంటే 300 క్యాలరీలు అధికంగా తీసుకోవాలి. ఇందుకోసం తక్కువ ఆహారంలో ఎక్కువ క్యాలరీలు ఉండేలా, పోషకభరిత పదార్థాలనే ఎంచుకోవాలి.

గర్భిణి తీసుకునే క్యాల్షియం మీదే కడుపులో పెరిగే బిడ్డ ఎముకల దృఢత్వం ఆధారపడి ఉంటుంది. కాబట్టి గర్భిణులు తప్పనిసరిగా పాలు, పెరుగు, జున్ను లాంటివి తీసుకుంటూ ఉండాలి.

ఐరన్‌ సమృద్ధిగా శరీరానికి అందడం కోసం ప్రతి రోజూ ఆహారంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. నట్స్‌, డ్రై ఫ్రూట్స్‌, పండ్ల రసాలు తీసుకోవాలి.

వాంతుల సమస్య వేధిస్తున్నా, కడుపు నిండిన భావనతో ఆకలి మందగిస్తున్నా అశ్రద్ధ చేయకుండా వైద్యులను కలవాలి. ఒకేసారి భారీ భోజనం చేయకుండా, తక్కువ పరిమాణాల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి.

ఫోలేట్‌ కోసం కమలా పండ్లు తరచుగా తింటూ ఉండాలి.

ఈ పండ్లు తినడం వల్ల సాధారణంగా గర్భిణులను వేధిస్తూ ఉండే మలబద్ధకం దరి చేరకుండా ఉంటుంది.

చిగుళ్ల వాపు, దంత సమస్యలు లాంటి చిన్నాచితకా ఆరోగ్య సమస్యలు గర్భిణుల్లో సహాజం. అయితే వాటికి చిట్కాలు పాటించడం మాని, వైద్యుల సూచన మేరకు నడుచుకోవాలి. అలాగే స్వీయ చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్‌ మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు.

Updated Date - Jan 21 , 2025 | 03:28 AM