ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rice: అన్నం కూడా ఔషధమే!

ABN, Publish Date - Jan 25 , 2025 | 03:19 AM

‘‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’’ అంటారు మన పూర్వీకులు. ప్రతి రోజూ తినే ఈ అన్నానికి అంత ప్రాముఖ్యత ఇవ్వటానికి కారణం దానిలో ఉన్న పౌష్టికాహార విలువలు. కేవలం పౌష్టికాహార విలువలు మాత్రమే కాకుండా అన్నానికి అనేక రకాల విశిష్టతలు కూడా ఉన్నాయి.

‘భక్తము’ అంటే అన్నం అని అర్థం. ‘భక్తము’కు పంచబడేది, కేటాయించబడేది, నిర్దేశించబడేది అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఈ నిర్వచన కోణం నుంచి చూస్తే ఇతరులకు పెట్టేది అన్నం. దీనిని ఎలా వండాలనే విషయాన్ని కూడా భోజన కుతూహలంలో వివరించారు. అన్నాన్ని వండటానికి బియ్యాన్ని చేటలో చెరగాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఈ బియ్యపు కొలతకు ఐదు రెట్లు ఎక్కువగా నీళ్లు పోసి కాచాలి. ఇలా కాగిన నీటిని ఎసరు అంటారు. ఈ ఎసరులో బియ్యాన్ని పోసి సన్నటి సెగ మీద అన్నాన్ని ఉడకనివ్వాలి. ఈ సమయంలో నీరు దగ్గరపడుతూ ఉంటుంది. ఈ నీటిని గంజి అంటారు. సాధారణంగా ఈ గంజిని పారబోస్తారు. దీని వల్ల అన్నంలో అధికంగా ఉన్న పిండి పదార్థాలు కొట్టుకుపోతాయి. పాకదర్పణం అనే గ్రంథం ప్రకారం- గంజి వార్చకుండా అన్నం వండితే దానిని ‘అసృతాన్నదోషం’ అంటారు. అంటే ఈ తరహా అన్నం తింటే అరుగుదల కష్టమవుతుంది. రుచిలో కూడా తేడా ఉంటుంది. కఫదోషం పెరుగుతుంది. ఇక గంజివార్చిన తర్వాత అన్నం మెతుకులు ఒక దానికి మరొకటి అంటుకోకూడదు. ఇలా ఉండటాన్ని విశదం అంటారు. ఇలాంటి అన్నం మన జాఠరాగ్నిని పెంచుతుంది. పోషకంగా పనిచేస్తుంది. ఇలా తినే అన్నం రక్తంలో ఒత్తిడి (బీపీ), స్థూలకాయం, తలతిరుగుడు మొదలైన వాటికి విరుగుడుగా పనిచేస్తుంది. భోజనకుతూహలంలో అన్నం గురించి మరిన్ని వివరాలు ఉన్నాయి. అవి..

గంగరాజు అరుణాదేవి


చల్లారిన అన్నం జఠరాగ్నిని మందగింపచేస్తుంది. ఉబ్బసం, నోట్లో నీళ్లూరటం లాంటి బాధలు కలుగుతాయి.

చద్దన్నాన్ని పెరుగుతో కలిపి తింటే బీపీ తగ్గుతుంది చలవ చేస్తుంది. కానీ వాతాన్ని పెంచుతుంది. అందు వల్ల దీనిలో కూరగాయముక్కలను కలుపుకొని తినాలి.

బియ్యం కొలతకు 15 రెట్లు ఎక్కువగా పోసి.. ఉడికించి.. దాని ద్వారా వచ్చిన గంజిని తాగితే జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. దీనిని మెట్టటి అన్నం అంటారు.

బియ్యం కొలతలో నాలుగోవంతు పెసరపప్పు కలిపి వండే అన్నం ద్వారా వచ్చిన గంజిలో చాలా పోషకాలు ఉంటాయి.


ఇవి కూడా చదవండి..

Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా

Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..

Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 25 , 2025 | 03:56 AM