Milk Purity: పాలలో కల్తీని ఇలా గుర్తించండి!
ABN, Publish Date - Feb 03 , 2025 | 04:50 AM
పాలను బాగా కాచిన తరవాత తాగితే నాలుక మీద తీయని రుచి నిలిచినట్లయితే అవి స్వచ్చమైనవని చెప్పవచ్చు. ఏ రకంగా కల్తీ చేసినా పాలు నామమాత్రపు చేదు రుచిలో ఉంటాయి.
పాలలో నీరు కలిపిందీ లేనిదీ సులభంగా గుర్తించవచ్చు. ఏటవాలుగా ఉన్న ప్రదేశంపై పాల చుక్క వేయాలి. అది మెల్లగా కదులుతూ తెల్లని గీతని వదిలితే అవి స్వచ్ఛమైన పాలని చెప్పవచ్చు. అదే పాల చుక్క వేగంగా కిందికి జారితే నీళ్లు కలిపినట్లే!
అరగ్లాసు పాలలో అరగ్లాసు నీళ్లు పోసి వేగంగా కలపాలి. ఇలా కలుపుతున్నప్పుడు దట్టంగా నురుగు కనిపిస్తే పాలలో వాషింగ్ పౌడర్ లేదా డిటర్జెంట్ పౌండర్ కలిపినట్లు గుర్తించవచ్చు.
అరగ్లాసు పాలలో రెండు చెంచాల అయోడైజ్డ్ ఉప్పు వేసి బాగా కలపాలి. పాలు నీలం రంగులోకి మారితే అందులో మైదా లేదంటే వేరే ఏదైనా పిండిని కలిపినట్లు తెలుసుకోవచ్చు.
పావు గ్లాసు నీళ్లను బాగా వేడి చేసి అందులో అయిదు చుక్కల టించర్ అయోడిన్ కలపాలి. ఈ నీళ్లను పావు గ్లాసు పాలలో కలపాలి. వెంటనే పాలు నీలం రంగులోకి మారినట్లయితే గంజి పొడి కలిపినట్లు తెలుసుకోవచ్చు.
పావు గ్లాసు పాలలో ఒక చెంచా సోయాబీన్ పొడిని కలపాలి. దీనిలో ఎరుపు రంగు లిట్మస్ పేపర్‌ను ఉంచి పరీక్షించాలి. అది నీలం రంగులోకి మారినట్లయితే పాలలో యూరియా కలిపినట్లు గుర్తించవచ్చు.
బజార్లో దొరికే పీహెచ్ పట్టీని తీసుకు వచ్చి దానిపై ఒక పాల చుక్క వేయాలి. పీహెచ్ నిష్పత్తి 6.4 నుంచి 6.6 మధ్య ఉంటే ఆ పాలు స్వచ్ఛమైనవని చెప్పవచ్చు. అంతకన్నా ఎక్కువ లేదా తక్కువ ఉన్నట్లయితే పాలలో కల్తీ జరిగిందని గుర్తించాలి.
ఇవి కూడా చదవండి..
Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 03 , 2025 | 04:50 AM