Dark Circles: ఇలా చేస్తే నల్లని వలయాలు మాయం
ABN, Publish Date - Mar 02 , 2025 | 05:05 AM
అలసట, ఒత్తిడి, నిద్రలేమి లాంటి కారణాలవల్ల కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతూ ఉంటాయి. మంచి పోషకాహారం తీసుకోవడంతోపాటు కొన్ని చిట్కాలు పాటించి వీటిని పోగొట్టుకోవచ్చు.
ఒక ఐస్ ముక్కను తీసుకుని పలుచని రుమాలులో చుట్టి దాంతో కళ్లకింద మెల్లగా రుద్దాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు ఇలా చేస్తూ ఉంటే కళ్ల అలసట తగ్గి క్రమంగా నల్లని వలయాలు మాయమవుతాయి.
కీరా దోసకాయ లేదా బంగాళదుంపను చక్రాల్లా కోసి వాటిని కళ్ల మీద పెట్టుకుని అరగంట విశ్రాతి తీసుకోవాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే కళ్ల కింద రక్త ప్రసరణ మెరుగుపడి నలుపుదనం తగ్గుతుంది.
ఎర్రని టమాటాను శుభ్రంగా కడిగి మధ్యకు కోసి గట్టిగా పిండితే రసం వస్తుంది. ఇందులో దూదిని ముంచి దాంతో కళ్ల చుట్టూ సున్నితంగా అద్దాలి. పది నిమిషాల తరవాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. టమాటాను చక్రాలుగా తరిగి వాటిని కళ్లమీద పెట్టుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది.
ఒక గిన్నెలో ఒక చెంచా బాదం నూనె, ఒక చెంచా ఇ విటమిన్ నూనె వేసి బాగా కలపాలి. రాత్రి పడుకునేముందు ఈ మిశ్రమంతో కళ్ల చుట్టూ మర్దన చేయాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే వారం రోజుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది.
వాడేసిన టీ బ్యాగ్‌లను ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇవి చల్లగా అయ్యాక వాటిని కళ్ల మీద పెట్టుకుని పది నిమిషాలు ఉంచుకోవాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే కళ్ల కింద నలుపు తగ్గిపోతుంది.
రెండు చెంచాల కొబ్బరి నూనెలో ఒక చెంచా కలబంద గుజ్జు కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ పరచాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మూడు రోజులపాటు ఇలా చేస్తే కళ్ల కింద నల్లని వలయాలు తగ్గిపోతాయి.
ఇవి కూడా చదవండి
Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
Congress: కేరళ కాంగ్రెస్ నేతల భేటీకి థరూర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 02 , 2025 | 05:05 AM