ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నూనె వాడకం తగ్గించాలంటే..!

ABN, Publish Date - Feb 11 , 2025 | 10:50 PM

వంటకాల్లో అధికంగా నూనెను ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. నూనె వాడకాన్ని ఎలా తగ్గించాలో తెలుసుకుందాం!

వంటకాల్లో అధికంగా నూనెను ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. నూనె వాడకాన్ని ఎలా తగ్గించాలో తెలుసుకుందాం!

  • వంట చేసేటప్పుడు నూనెను నేరుగా బాటిల్‌తో కాకుండా చెంచాతో కొలిచి వేయడం అలవాటు చేసుకోవాలి. కూరలు చేసేటప్పుడు, పచ్చళ్ల తాలింపులో ఎక్కువ నూనెని ఉపయోగించవద్దు.

  • మూకుడు నిండుగా నూనె పోసి చేసే వంటకాలకు బదులు ఆవిరి మీద ఉడికించి చేసే అల్పాహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేపుళ్లు తగ్గించాలి. తాలింపు కూరలు చేసుకుంటే శరీరానికి ఎ, డి, కె విటమిన్లు బాగా అందుతాయి.

  • అప్పడాలను నూనెలో వేయించకుండా సన్నని మంట మీద కాల్చుకుని తినవచ్చు.

  • డీప్‌ ఫ్రైకి బదులు షాలో ఫ్రై, రోస్ట్‌, బేకింగ్‌, గ్రిల్లింగ్‌, స్టీమింగ్‌ పద్ధతులను అనుసరించాలి.

  • గ్రేవీ ఆధారిత కూరలు, తొందరగా మగ్గే కూరలను తక్కువ నూనెతో చేసుకోవచ్చు. మాంసాహార కూరలు చేసేటప్పుడు అవసరమైనంతే నూనె వాడాలి.

  • దోశలు చేసేటప్పుడు పెనం మీద చెంచాతో నూనె రాయడానికి బదులు ఒక పెద్ద ఉల్లిపాయను మధ్యకు కోసి దానితో రుద్దితే చాలు. కావాలనుకుంటే దోశమీద బ్రష్‌తో కొద్దిగా నూనె రాసుకోవచ్చు. చపాతీలు కాల్చేటప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి.

  • కూరగాయల ముక్కలను ముందుగానే ప్రెజర్‌ కుక్కర్‌ లేదా ఓవెన్‌లో ఉడికించి తరవాత తేలికపాటి తాలింపుతో కూరలు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

  • నెలకి ఎంత నూనె వాడుతున్నామో ఒక పుస్తకంలో రాసి పెట్టుకోవాలి. దీనివల్ల నూనె వాడకంపై ఒక అవగాహన వస్తుంది.

Updated Date - Feb 11 , 2025 | 10:50 PM