ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Screen Time: పిల్లల స్ర్కీన్‌ టైమ్‌ తగ్గించండి

ABN, Publish Date - Mar 02 , 2025 | 05:00 AM

పిల్లలు ఎక్కువసేపు టీవీ, ఫోన్‌ స్ర్కీన్‌లను చూడడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కంటి చూపు, మానసిక స్థితికి సంబంధించి పలు సమస్యలు ఎదురవుతాయని సూచిస్తున్నారు.

తల్లిదండ్రులను అనుసరించడం పిల్లల సహజ గుణం. పిల్లలు టీవీ లేదా ఫోన్‌ చూడకుండా ఉండాలంటే ముందుగా తల్లిదండ్రులు ఆ పని చేయాలి. పిల్లలు ఇంట్లో ఉన్న సమయంలో టీవీ పెట్టకూడదు. ఫోన్‌ రింగ్‌టోన్‌ని కూడా బాగా తగ్గించి ఉంచుకోవాలి. అవసరమైతేనే ఫోన్‌లో మాట్లాడాలి.

పిల్లల స్ర్కీన్‌ టైమ్‌ని నియంత్రించడంలో తల్లిదండ్రులు కఠినంగానే వ్యవహరించాలి. ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించి అప్పుడు మాత్రమే టీవీని చూడనివ్వాలి. అలాగే ఫోన్‌లో గేమ్స్‌ ఆడుకోనివ్వాలి. మిగిలిన సమయంలో వాటి జోలికి పోకూడదనే నిబంధన విధించాలి. దీనివల్ల పిల్లల్లో సమయపాలన అలవడుతుంది. తల్లిదండ్రులు చెప్పినట్లు వినాలనే భావన మొదలవుతుంది.

పిల్లలకు ఆరుబయట ఆటలాడడం అలవాటు చేస్తే వాళ్లు దాన్నే ఇష్టపడతారు. చుట్టుపక్కల ఉండే పిల్లలతో కలిసి ఆడుకోవడాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. కుటుంబ సభ్యులంతా కలిసి చెస్‌, క్యారమ్స్‌, షటిల్‌ కాక్‌, రింగ్‌ త్రో, దాగుడుమూతలు, మ్యూజికల్‌ ఛైర్స్‌ లాంటి ఆటలు ఆడుతూ ఉంటే పిల్లలకు ఆటవిడుపుగా ఉంటుంది.



టీవీ లేదా ఫోన్‌ నుంచి పిల్లల దృష్టి మరల్చడానికి వారిని చిన్నచిన్న పనుల్లో భాగస్వాములను చేయడం మంచిది. ఇంటి పనులు, తోట పని చెప్పి చేయించాలి. కొంచెం పెద్ద పిల్లలు అయితే బజారు నుంచి కూరలు, పళ్లు తేవడం లాంటివి చెప్పవచ్చు.

తల్లిదండ్రులు ఎవరి పనుల్లో వారు పూర్తిగా మునిగిపోతే పిల్లలు టీవీకి అలవాటు పడే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని పిల్లలతో గడపాలి. వారానికి ఒకసారి పిల్లలతో పార్క్‌కు వెళ్లడం, రాత్రిపూట కలిసి భోజనం చేయడం, పడుకునే ముందు కొద్దిసేపు పిల్లలతో మాట్లాడడం, వారాంతాల్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఏదైనా ట్రిప్‌కు వెళ్లడం లాంటివి పిల్లల వికాసానికి తోడ్పడతాయి. ఈ క్రమంలో పిల్లలు ఫోన్‌ గురించి మర్చిపోయే అవకాశం ఉంటుంది.



ఇవి కూడా చదవండి

Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్‌ అవినీతిపై పర్వేష్ వర్మ

Congress: కేరళ కాంగ్రెస్‌ నేతల భేటీకి థరూర్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2025 | 05:00 AM