ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cancer Symptoms: అండాశయాలకు క్యాన్సర్‌ సోకితే?

ABN, Publish Date - Jan 21 , 2025 | 03:31 AM

కొన్ని వ్యాధుల లక్షణాలు ఆందోళన కలిగించేంత తీవ్రంగా ఉండవు. కొన్ని లక్షణాలు ఇతరత్రా సాధారణ రుగ్మతలను పోలి ఉంటాయి.

కొన్ని వ్యాధుల లక్షణాలు ఆందోళన కలిగించేంత తీవ్రంగా ఉండవు. కొన్ని లక్షణాలు ఇతరత్రా సాధారణ రుగ్మతలను పోలి ఉంటాయి. దాంతో అంతర్గతంగా వ్యాధి ముదిరిపోయే వరకూ కనిపెట్టలేకపోతూ ఉంటాం! అలాంటి వ్యాధుల కోవకు చెందినదే ‘అండాశయ క్యాన్సర్‌’!

రొమ్ము క్యాన్సర్‌కు మాదిరిగా ముందస్తు వ్యాధినిర్ధారక పరీక్షలు లేకపోవడం మూలంగా అండాశయ క్యాన్సర్‌ మరణాలు పెరుగుతున్నాయి. అయితే ఈ క్యాన్సర్‌కు మూల కారణాన్ని కనిపెట్టే వీలు లేకపోయినా, సరైన సమయంలో లక్షణాలను గుర్తించి, వెంటనే చికిత్స మొదలుపెట్టగలిగితే క్యాన్సర్‌ను నిర్మూలించడం కష్టమేమీ కాదు. ఇందుకోసం లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవేంటంటే....

కడుపు ఉబ్బరం, కడుపులో ఒత్తిడి, నొప్పి

తిన్న వెంటనే కడుపులో ఇబ్బందికరంగా ఉండడం, ఆకలి మందించడం

తరచూ మూత్ర విసర్జన చేయాలని అనిపించడం

అజీర్తి, మలబద్ధకం

విపరీతమైన వెన్ను నొప్పి, ఛాతీలో మంట

అస్తవ్యస్థ రుతుక్రమం


ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే స్త్రీల వైద్యులను సంప్రతించాలి.

ఎవరికి రావచ్చు?

క్యాన్సర్‌ సంక్రమించడానికి పలు కారణాలు ఉంటాయి. అయితే కొందరికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. వారు ఎవరంటే...

అండాశయ క్యాన్సర్‌ వచ్చిన రక్తసంబంధీకులు కలిగినవారు

కాలక్రమేణా మార్పు చెందిన అండాశయ క్యాన్సర్‌కు చెందిన జన్యువులు కలిగి ఉన్న వారు

రొమ్ము, పెద్దపేగు, మూత్రాశయ క్యాన్సర్లకు గురయినవారు

ఊబకాయం కలిగినవాళ్లు

పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన చికిత్సలు, హార్మోన్‌ చికిత్సలు తీసుకున్నవారు

జీవితకాలంలో గర్భం దాల్చని మహిళలు

Updated Date - Jan 21 , 2025 | 03:31 AM