Packaged Foods: లేబుళ్లు - మతలబులు
ABN, Publish Date - Feb 11 , 2025 | 04:24 AM
సూపర్‌మార్కెట్లలో ప్యాకెట్లలో దొరికే పదార్థాలు, పానీయాలు మన బరువును తగ్గించే ప్రయత్నంలో ఉన్న భ్రమకు లోను చేసే లేబుళ్లను కలిగి ఉంటాయి. మరీ ముఖ్యంగా వాటిలోని చక్కెర మోతాదులను తెలపడం కోసం చిత్రమైన పదాలను ఉపయోగిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పదాల అసలు అర్థాలను తెలుసుకోవడం ఎంతో అవసరం.
చక్కెర మోతాదులు
కొన్ని ప్యాకెట్ల మీద చక్కెర మోతాదు ‘ఫ్రీ’ లేదా ‘లో’గా ముద్రించి ఉంటుంది. అంటే ఆ ప్యాకెట్‌లో, ఉపయోగించవలసిన దాని కంటే తక్కువ చక్కెరను ఉపయోగించారు కాబట్టి మిగతా ఉత్పత్తులతో పోలిస్తే దాన్లో ఉన్న చక్కెర తక్కువని అర్థం.
షుగర్ ఫ్రీ
ఈ ఉత్పత్తుల్లో ఒక సర్వింగ్‌లో 0.5 గ్రాముల చక్కెర ఉంటుంది. ఆ చక్కెర సహజసిద్ధమైనదీ, జోడించినదీ అయి ఉండవచ్చు. ఫ్రీ ఆఫ్ షుగర్, షుగర్‌లెస్, నో షుగర్, జీరో షుగర్.. ఇవన్నీ ఇదే అర్థాన్ని కలిగి ఉంటాయి.
రెడ్యూస్డ్/లెస్ షుగర్
సాధారణ ఉత్పత్తులతో పోల్చితే దీన్లో కనీసం 25ు తక్కువ చక్కెర ఉందని అర్థం.
నో యాడెడ్ షుగర్
శుద్ధి చేసే సమయంలో, లేదా ప్యాక్ చేసే సమయంలో చక్కెర లేదా చక్కెర కలిగి ఉన్న దినుసును జోడించలేదని అర్థం. సహజ చక్కెర కలిగిన పదార్థాల ప్యాకెట్ల మీద, లో క్యాలరీ స్వీటెనర్ లేదా షుగర్ సబ్‌స్టిట్యూట్ అని పేర్కొని ఉంటుంది.
చక్కెర లేకపోయునా...
ఉత్పత్తిలో చక్కెర లేదని పేర్కొన్నంతమాత్రాన అది ఆరోగ్యానికి మంచిదని భావించడం కూడా పొరపాటే! ఉదాహరణకు ఉదయం బ్రేక్‌ఫా్‌స్టలో భాగంగా తినే సిరీల్ ప్యాకెట్ మీద ‘రెడ్యూ్‌సడ్ షుగర్’ లేదా ‘లైట్లీ స్వీటెన్డ్’ అని పేర్కొని ఉండవచ్చు. దాంతో మిగతా వాటికంటే ఇదే మెరుగైన ఉత్పత్తి అనే భావన కలుగుతుంది. నిజానికి కంపెనీలు, ప్రచారంలో భాగంగా, వాటి ఉత్పత్తుల్లో 30ు తక్కువ చక్కెర వాడినట్టు పేర్కొంటూ ఉంటాయి. కానీ నిజానికి వాటిలోని చక్కెర మోతాదులు అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు.
ఇవి కూడా చదవండి..
Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..
Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!
For More National News and Telugu News..
Updated Date - Feb 11 , 2025 | 04:24 AM