ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tile Cleaning: టైల్స్‌ మురికిని ఇలా వదిలించండి!

ABN, Publish Date - Mar 01 , 2025 | 07:02 AM

నేల మీద తెల్లగా మెరుస్తూ ఉండే టైల్స్‌.... ఇంటి శోభను పెంచుతాయి. వీటిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అవి ఎప్పటికీ కొత్తవాటిలాగే కనిపిస్తాయి.

టైల్స్‌ని వ్యాక్యూమ్‌ క్లీనర్‌ లేదా మెత్తని చీపురుతో ప్రతిరోజూ శుభ్రం చేయాలి. దుమ్ము, ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉంచుకుంటే టైల్స్‌ చక్కగా మెరుస్తూ కనిపిస్తాయి.

ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల కల్లు ఉప్పు వేసి కరిగించాలి. ఇందులో పలుచని వస్త్రాన్ని ముంచి గట్టిగా పిండి దాంతో ఇల్లంతా తుడవాలి. టైల్స్‌ మీద మరకలు ఉంటే వాటి మీద కొన్ని ఉప్పు నీళ్లు చల్లి గట్టిగా రుద్ది తుడవాలి. ప్రతిరోజూ ఇలా చేస్తూ ఉంటే టైల్స్‌ మీద చేరే బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది.

బకెట్‌ నీళ్లలో కొద్దిగా టూత్‌పేస్టు వేసి కలపాలి. ఇందులో ముంచిన మాప్‌తో టైల్స్‌ని తుడిస్తే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

ఒక కప్పు వేడినీటిలో అర కప్పు వైట్‌ వెనిగర్‌, ఒక చెంచా బేకింగ్‌ సోడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక బకెట్‌ నీళ్లలో వేసి కలపాలి. ఇందులో ముంచిన మాప్‌తో ఇల్లంతా తుడిస్తే... టైల్స్‌ మీద మురికి మొత్తం తొలగిపోయి కొత్తవాటిలా మెరుస్తాయి.



రెండు చెంచాల హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ద్రావణంలో ఒక చెంచా బేకింగ్‌ సోడా వేసి కలపాలి. ఈ పేస్టుని టైల్స్‌ మధ్య కనిపించే మురికి మీద రాయాలి. రెండు నిమిషాల తరవాత పొడి వస్త్రంతో తుడిచేస్తే మురికి మొత్తం తొలగిపోతుంది. ఒక బకెట్‌ నీళ్లలో రెండు చెంచాల హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ద్రావణం వేసి కలపాలి. ఇందులో సన్నని వస్త్రం లేదా మాప్‌ ముంచి దానితో టైల్స్‌ని రుద్దుతూ తుడిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఒక కప్పు వేడి నీటిలో ఒక కప్పు వెనిగర్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక స్ర్పే బాటిల్‌లో పోసి ఉంచుకోవాలి. దీన్ని టైల్స్‌పై చేరిన మురికి లేదా మరకలపై కొద్దిగా స్ర్పే చేసి పాత టూత్‌బ్ర్‌షతో రుద్ది వెంటనే కాగితం లేదా వస్త్రంతో తుడవాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే టైల్స్‌ రంగు మారకుండా ఉంటాయి.

టైల్స్‌ని శుభ్రం చేయడానికి బజార్లో దొరికే రసాయన ద్రావణాలను ఉపయోగించకపోవడమే మంచిది. వీటివల్ల అవి మెరుపుని కోల్పోతాయి.


Updated Date - Mar 01 , 2025 | 07:02 AM