ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెదవులు తేమగా...

ABN, Publish Date - Mar 06 , 2025 | 05:54 AM

గాలి, ఎండ, వాతావరణ కాలుష్యం వల్ల పెదవులు పొడిబారి నల్లగా మారుతుంటాయి. ఇలా నిర్జీవంగా మారిన పెదవులను కొన్ని చిట్కాలతో అందంగా మార్చుకోవచ్చు..

గాలి, ఎండ, వాతావరణ కాలుష్యం వల్ల పెదవులు పొడిబారి నల్లగా మారుతుంటాయి. ఇలా నిర్జీవంగా మారిన పెదవులను కొన్ని చిట్కాలతో అందంగా మార్చుకోవచ్చు.

  • ఒక గిన్నెలో ఒక చెంచా తేనె, అర చెంచా దానిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు పట్టించాలి. పావుగంటసేపు ఆరనివ్వాలి. తరవాత నీటితో శుభ్రం చేసుకుని లిప్‌బామ్‌ రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే పెదవులు తేమతో నిండి ఆరోగ్యంగా కనిపిస్తాయి.

  • పెదవులకు తరచూ పేరిన నెయ్యి, వెన్న, పాల మీగడ రాసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.


  • ఒక చెంచా కాఫీ పొడిలో అర చెంచా కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ పేస్టుని పెదవులకు పట్టించి అయిదు నిమిషాల తరవాత వేళ్లతో మెల్లగా రుద్దితే మృతకణాలన్నీ తొలగిపోతాయి.

  • ఒక గిన్నెలో ఒక చెంచా పంచదార, అరచెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి రెండు నిమిషాలు ఒకే దిశలో మర్దన చేయాలి. తరవాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే పెదవులపై ఉండే చర్మపు పొరల్లో తేమ నిండుతుంది.

  • ఒక చెంచా దాల్చినచెక్క పొడిలో అర చెంచా తేనె కలిపి..... ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునేముందు పెదవులకు రాయాలి. ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే పెదవులకు రక్తప్రసరణ మెరుగవుతుంది.

  • ఒక గిన్నెలో రెండు చెంచాల బీట్‌రూట్‌ పేస్టు, ఒక చెంచా పంచదార, అరచెంచా కొబ్బరినూనె వేసి కలపాలి.

  • ఈ మిశ్రమాన్ని పెదవులకు పట్టించి రెండు నిమిషాలు సున్నితంగా రుద్దాలి. పొడిబారిన చర్మం పొర తొలగిపోయి పెదవులు మృదువుగా మారతాయి.

  • ఫ ఒక చెంచా బీట్‌రూట్‌ రసం, అర చెంచా పాలు, అరచెంచా తేనె కలిపిన మిశ్రమాన్ని పెదవులకు రాయాలి. పావుగంటసేపు ఆరిన తరవాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ఎండవల్ల నల్లబడిన పెదవులు గులాబీ రంగులోకి మారతాయి.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 06 , 2025 | 05:54 AM