Eye Health: స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్
ABN, Publish Date - Feb 11 , 2025 | 04:28 AM
మన పనులు, కాలక్షేపాలు స్మార్ట్‌ఫోన్లతోనే ముడిపడిపోవడంతో, దీర్ఘకాలం పాటు వాటిని వాడుకుంటూ ఉండడం వల్ల, స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ సమస్య తలెత్తుతోంది. కళ్లను దెబ్బతీసే ఈ సమస్యను అరికట్టాలంటే...
ఎక్కువ సమయాల పాటు: పని కోసం, కాలక్షేపం కోసం, వినోదం కోసం ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోవడం మానేయాలి
కళ్లు ఆర్పడం: స్మార్ట్‌ఫోన్లను వాడుకుంటున్నప్పుడు కళ్లు ఆర్పడం 60 శాతం మేరకు తగ్గించేస్తూ ఉంటాం. దాంతో కళ్లు మంటలు, పొడిబారే సమస్యలు మొదలవుతాయి.
కళ్లకు దగ్గరగా: ఫోన్లను కళ్లకు మరీ దగ్గరగా పెట్టుకుని వాడుకోవడం వల్ల కంటి కండరాల మీద ఒత్తిడి పెరుగుతుంది.
సరిపడా వెలుగు: తక్కువ వెలుగులో ఫోన్లను వాడుకోవడం వల్ల కూడా కళ్ల మీద ఒత్తిడి పెరుగుతుంది.
లక్షణాలు ఇవే!
చూపు మసకబారడం: ఏకాగ్రతగా చూడలేకపోవడం
తలనొప్పి: కళ్లు అలసటకు గురవడంతో తరచూ తలనొప్పి వేధించడం
కళ్లు: కనురెప్పలు ఆర్పకపోవడం వల్ల కళ్లు పొడిబారడం
మెడ, భుజం నొప్పి: స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించేటప్పుడు సరైన శరీర భంగమ పాటించడకపోవడం వల్ల మెడ, భుజం నొప్పులు వేధిస్తాయి
నిద్రలేమి: నీలి వెలుగుకు అవసరానికి మించి బహిర్గతం అవడం వల్ల శరీర జీవగడియారం క్రమం తప్పి, నిద్ర సమస్యలు వేధిస్తాయిపరిష్కారాలున్నాయి
కృత్రిమ కన్నీళ్లు: ఇవి పొడిబారిన కళ్లకు తేమనిచ్చి, మంటను తగ్గిస్తాయి
బ్లూ లైట్ గ్లాసెస్: ఈ ప్రత్యేకమైన లెన్స్‌లు నీలి రంగును వడగట్టి కళ్ల అలసటను నివారిస్తాయి
కంటి వ్యాయామాలు: ప్రతి 20 నిమిషాలకూ, 20 సెకన్ల పాటు, 20 అడుగుల దూరంలో ఉన్న ఒక వస్తువును చూడగలిగితే కంటి కండరాలు సేద తీరతాయి.
ఇవి కూడా చదవండి..
Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..
Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!
For More National News and Telugu News..
Updated Date - Feb 11 , 2025 | 04:28 AM