ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వేసవిలో వృద్ధులు ఇవి పాటించాలి!

ABN, Publish Date - Feb 27 , 2025 | 05:38 AM

వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతల కారణంగా వృద్ధులలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేసవికాలాన్ని హాయిగా...

వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతల కారణంగా వృద్ధులలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేసవికాలాన్ని హాయిగా గడిపేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

  • తేలికగా, వదులుగా, మెత్తగా ఉండే నూలు దుస్తులు ధరించాలి. లేత రంగులు లేదా తెలుపువి అయితే మంచిది.

  • మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లకూడదు. సాయంత్రం నాలుగు గంటల తరవాత వాతావరణం చల్లబడినప్పుడు మాత్రమే వాకింగ్‌కు వెళ్లాలి.

  • తరచూ ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి. మంచి నీళ్లు, కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు, రాగి జావ, బార్లీ నీళ్లు, సగ్గుబియ్యం జావ, పలుచని మజ్జిగ తాగడం మంచిది.

  • తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మసాలాలు, నూనె పదార్థాలు తినకూడదు.


  • కాఫీ, టీ తాగకూడదు. వీటివల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది.

  • ఇంట్లో కిటికీలు తెరచి ఉంచాలి. మధ్యాహ్న సమయంలో ఎండ ఎక్కువగా ఉన్న పక్షంలో కిటికీలకు కర్టెన్లు వేయాలి.

  • బెడ్‌రూమ్‌లో పడుకునే సమయంలో ఫ్యాన్‌, ఏసీ, కూలర్‌ వినియోగించుకోవాలి.

  • ఎండగా ఉన్నప్పుడు బయటికి వెళ్లాల్సి వస్తే హ్యాట్‌, గాగుల్స్‌, స్కార్ప్‌ ధరించాలి. మంచినీళ్లు తాగి వెళ్లాలి. తలకి తడి తువాలు కట్టుకోవాలి. ఎక్కువసేపు బయట ఉండాల్సి వస్తే ముఖాన్ని చల్లని నీళ్లతో కడుక్కుంటూ ఉండాలి.

  • తరచూ బీపీ, షుగర్‌ స్థాయిలను పరీక్షించుకుంటూ ఉండాలి.

  • నీరసం, బలహీనత, తలనొప్పి, కడుపులో తిప్పడం, వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రతించాలి.


Updated Date - Feb 27 , 2025 | 05:38 AM