ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gardening: ఇంటి తోట పెంచాలంటే..!

ABN, Publish Date - Feb 07 , 2025 | 11:45 PM

చాలామంది ఇంటి పరిసరాల్లో చిన్నపాటి తోటను పెంచుకోవాలని అనుకుంటారు. పూలు, కూరగాయల మొక్కలతో కూడిన అందమైన తోటను సృష్టించడానికి నిపుణులు అందిస్తున్న సూచనలు ఇవే...

మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే ఎక్కువసేపు సూర్యకాంతి నిలుస్తూ ధారాళంగా గాలి వీచే ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇంటి వెనక, బాల్కనీ, మిద్దెలు తోట పెంపకానికి అనువుగా ఉంటాయి.

తోట కోసం కేటాయించిన స్థలాన్ని దృష్టిలో ఉంచుకుని తోట విస్తరణలో భాగంగా పళ్ల మొక్కలు, ఔషధ మూలికలు పెంచవచ్చు.

తోట పెంచడానికి అవసరమైన మట్టి, సేంద్రియ ఎరువులు, విత్తనాలు, నీళ్లు పిచికారీ చేసే డబ్బాలు, ఆవుపేడ, మట్టితో తయారు చేసిన కుండీలు, నీటి సదుపాయం తదితరాలను సమకూర్చుకోవాలి. వంటగది వ్యర్థాలు, పళ్ల తొక్కలు, ఎండిన ఆకులతో కంపోస్ట్‌ తయారు చేసుకోవచ్చు.

మొక్కలు పెరుగుతున్నప్పుడు ప్రాథమిక సంరక్షణ అత్యవసరం. అదనంగా పెరిగిన కొమ్మలను కత్తిరించాలి. ఎండిన ఆకులను ఎప్పటికప్పుడు తీసివేయాలి. తెగుళ్లు సోకకుండా రసాయనాలకు బదులు వేపనూనెని నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి.

మొక్కలకు రోజూ కనీసం నాలుగు గంటలు ఎండ తగిలేలా చూసుకోవాలి. అంత వేడి అవసరం లేని మొక్కలకు ఎండ తగలకుండా చుట్టూ పరదా కట్టాలి. మొక్క స్వభావాన్నిబట్టి నీరు పోయాలి.

Updated Date - Feb 07 , 2025 | 11:45 PM