ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Alcohol: మద్యంతో ముప్పులు

ABN, Publish Date - Feb 25 , 2025 | 03:45 AM

మద్యపానం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మద్యంతో ఆరోగ్యానికి పొంచి ఉండే ప్రధాన ముప్పులు ఏవంటే...

క్యాన్సర్‌ ముప్పు: ఆల్కహాల్‌కు ‘కార్సినోజెన్‌’ అనే పేరుంది. అంటే మద్యంతో రొమ్ములు, కాలేయం, తల, మెడ, గొంతు, పెద్దపేగు.. ఇలా పలురకాల క్యాన్సర్ల ముప్పు పొంచి ఉంటుంది

కాలేయ జబ్బు: తీవ్ర మద్యపాన వ్యసనంతో కాలేయానికి కొవ్వు పడుతుంది. మద్యం సంబంధిత కామెర్లు, కాలేయం గట్టిపడే ఫైబ్రోసిస్‌, సిర్రోసిస్‌, కాలేయ వైఫల్యం సమస్యలు పొంచి ఉంటాయి

గుండె జబ్బులు: రక్తపోటు పెరుగుతుంది. గుండె లయ క్రమం తప్పుతుంది. గుండెపోటు ముప్పు పెరుగుతుంది

ఇన్‌ఫెక్షన్లు: వ్యాధినిరోధకశక్తి బలహీనపడుతుంది. ఫలితంగా క్షయ లాంటి ఇన్‌ఫెక్షన్లు సులభంగా సోకుతాయి

నాడీ నష్టం: దీర్ఘకాలం పాటు విపరీతంగా మద్యం తాగితే, జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మద్యం సంబంధిత బ్రెయిన్‌ డ్యామేజీ జరుగుతుంది

స్వీయ హాని: మద్యం నిర్ణయ సామర్థ్యాన్ని కుంటు పరుస్తుంది. ఆత్మహత్య, స్వీయ హాని ఆలోచనలను పెంచుతుంది. భావోద్వేగాలు అదుపుతప్పేలా చేస్తుంది

మానసిక కుంగుబాటు: మద్యంతో మానసిక కుంగుబాటు, ఆందోళనలు పెరుగుతాయి


ఇవి కూడా చదవండి..

Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు

Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?

Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్‌ బోర్డుకు తారు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 25 , 2025 | 03:45 AM