ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bitcoin Fluctuations: 84 వేల డాలర్ల వద్ద తచ్చాడుతున్న బిట్‌కాయిన్.. వారాంతంపైనే అందరి దృష్టి!

ABN, Publish Date - Feb 28 , 2025 | 01:10 PM

క్రిప్టో కరెన్సీపై ప్రస్తుతం అనిశ్చిత కొనసాగుతోంది. అందరి దృష్టి వారాంతంలో చోటుచేసుకునే పరిణామాలపై నెలకొంది బిట్‌కాయిన్ విలువ 89 డాలర్లు చేరుకునే అవకాశం ఉన్నా అమెరికా నిర్ణయాలు, ఆర్థిక ఒడిదుడుకులతో వాస్తవ విలువ కాస్త తగ్గొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు, ట్రంప్ నిర్ణయాల ప్రభావంపై అస్పష్టతో బిట్‌కాయిన్‌ (Bitcoin) పెట్టుబడిదారుల్లో అనిశ్చిత నెలకొంది. గురువారం నాటికి బిట్‌కాయిన్ విలువ 84 వేల వద్ద తచ్చాడుతుండగా అందరి దృష్టి వారాంతంపైనే నెలకొంది. నేటితో 5.07 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో డెరివేటివ్‌ల కాలపరమితి ముగియనుండటంతో తదుపరి ఏం జరుగుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ వారంతంలో బిట్‌కాయిన్ విలువ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి .


Check PF Balance Without UAN: పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా.. యూఏఎన్ మర్చిపోయారా.. అయితే..

ఈవారం బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ భారీగా నష్టపోయాయి. అయితే, వ్యవస్థాగత మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో కొంత ఆశాభావం నెలకొంది. గురువారం క్రిప్టో డెరివేటివ్స్ ఏకంగా 326.81 మిలియన్ డాలర్లు కోల్పోయాయి. అయితే, ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడర్స్‌లో ఆశాభావం కారణంగా 108 మిలియన్ల మేర నష్టాలు తగ్గాయి. ప్రస్తుతం ఓపెన్ ఫ్యూచర్స్ ఇంటర్నెస్ట్ 55,100 బీట్‌కాయిన్‌ల మధ్య తచ్చాడుతోంది.


Gold Rates Today: పసిడి కొనేందుకు తగిన సమయం.. స్వల్పంగా తగ్గిన ధరలు

భవిష్యత్తులో బిట్‌కాయిన్ విలువ తగ్గుతుందనేందుకు సూచనా క్రిప్టో ఫియర్ అండ్ గ్రీడ్ సూచీ 10 పాయింట్ల వద్దే తచ్చాడుతోంది. నేటి పరిణామాలపైనే క్రిప్టో సమీప భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బిట్‌కాయిన్ 89 వేల డాలర్లు తాకొచ్చన్న అంచనా లున్నా ప్రతికూల వార్తలు కచ్చితంగా వాస్తవ విలువను తగ్గిస్తాయన్న భయాలు నెలకొన్నాయి. చరిత్రలో నమోదైన గరిష్ఠ విలువకు 22 శాతం తక్కువగా ప్రస్తుతం బిట్ కాయిన్ ట్రేడవుతోంది.

Read Latest and Business News

Updated Date - Feb 28 , 2025 | 05:04 PM