ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati : కల్తీ నెయ్యి కేసులో ఏ 3, ఏ 5 కస్టడీకి పిటిషన్‌

ABN, Publish Date - Feb 20 , 2025 | 05:49 AM

కల్తీ నెయ్యి కేసులో నిందితులను మళ్లీ తమ కస్టడీకి అనుమతించాలని కోరుతూ సిట్‌ అధికారులు తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో...

  • విచారణకు స్వీకరణ... ఖరారు కాని తేదీ

తిరుపతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి కేసులో నిందితులను మళ్లీ తమ కస్టడీకి అనుమతించాలని కోరుతూ సిట్‌ అధికారులు తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో బుధవారం పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పర్యాయం మొత్తం నలుగురు నిందితులు కాకుండా కేవలం ఏ3, ఏ5 నిందితుల కస్టడీ కోసమే పిటిషన్‌ దాఖలు చేయడం గమనార్హం. వాస్తవానికి ఈనెల 13న నిందితులు నలుగురినీ ఐదు రోజుల పాటు సిట్‌ కస్టడీకి ఇచ్చింది. అయితే బుధవారం సిట్‌ అధికారుల తరఫున ఏపీపీ జయశేఖర్‌ 2వ ఏడీఎం కోర్టులో కస్టడీకి పిటిషన్‌ దాఖలు చేశారు. నలుగురినీ కాకుండా ఏ 3గా వున్న పొమిల్‌ జైన్‌, ఏ 5గా వున్న అపూర్వ వినయ్‌కాంత్‌ చావడాలను మాత్రమే కస్టడీకి అప్పగించాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ విచారణకు న్యాయమూర్తి స్వీకరించినప్పటికీ విచారణ తేదీని ఇంకా ఖరారు చేయలేదు.

Updated Date - Feb 20 , 2025 | 05:49 AM