మైనర్ కిడ్నాప్.. ఆందోళనలో కుటుంబసభ్యులు
ABN, Publish Date - Dec 06 , 2024 | 04:10 PM
Telangana: ఏపీలో మైనర్ బాలిక కిడ్నాప్‌కు గురైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 2న స్కూల్‌కు వచ్చిన ఓ మహిళ మాయమాటలు చెప్పి బాలికను బయటకు తీసుకువెళ్లింది. ఆ మహిళ స్థానికంగా ఉన్న చికెన్ షాప్‌లో పనిచేసే మహిళగా గుర్తించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, డిసెంబర్ 6: జిల్లాలో బాలిక కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం తూర్పు పాలెం గ్రామంలో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక కిడ్నాప్‌కు (Girl Kidnap) గురైంది. ఈనెల 2న స్కూల్‌కు వచ్చిన ఓ మహిళ మాయమాటలు చెప్పి బాలికను బయటకు తీసుకువెళ్లింది. ఆ మహిళ స్థానికంగా ఉన్న చికెన్ షాప్‌లో పనిచేసే మహిళగా గుర్తించారు.
Anagani: వారికి పూర్తి హక్కులు కల్పించడమే మా లక్ష్యం
మహిళతో పాటు చికెన్ షాపులో పనిచేసే మరో ఇద్దరు వ్యక్తులు కలిసి బాలికను కిడ్నాప్ చేసినట్టు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. బాలికను తీసుకువెళ్ళినట్టు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. బాలిక ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాలిక కిడ్నాప్‌పై ఈనెల 2న మలికిపురం పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాలిక అదృశ్యమై నాలుగు రోజులు గడుస్తున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాలిక ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
భవిష్యత్తులో ఆ దేశం అంతరించిపోతుంది.. ఎలాన్
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 06 , 2024 | 04:10 PM