ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. 5 లక్షల ఐటీ ఉద్యోగాలే లక్ష్యం..

ABN, Publish Date - Nov 22 , 2024 | 10:02 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల వైసీపీ అరాచక పాలన దెబ్బకు కొత్తగా ఒక్క కంపెనీ కూడా ఏర్పాటు కాలేదు. విశాఖ వంటి ప్రాంతాల నుంచి ఉన్న కంపెనీలు బయటకు వెళ్లాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల వైసీపీ అరాచక పాలన దెబ్బకు కొత్తగా ఒక్క కంపెనీ కూడా ఏర్పాటు కాలేదు. విశాఖ వంటి ప్రాంతాల నుంచి ఉన్న కంపెనీలు బయటకు వెళ్లాయి. ఎవరైనా ఏపీలో పెట్టుబడి పెట్టాలని వస్తే నాకేంటి అని అప్పటి సీఎం జగన్ అడిగే వారని చాలా మంది పారిశ్రామికవేత్తలే ఆఫ్ ద రికార్డుగా చెప్పే వారు. వైసీపీ పాలనలో పూర్తిగా నిర్వీర్యం అయిన ఐటీ రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఏపీలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల సృష్టే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. మూడు నెలల్లోనే విశాఖకు ప్రతిష్టాత్మక టీసీఎస్ తీసుకువస్తామని, అదానీ డేటా సెంటర్ కూడా వస్తుందని చెప్పారు. విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా మార్చే సంకల్పంతో చంద్రబాబు ప్రభుత్వం 2014-19లో ప్రోత్సాహకాలు కల్పిస్తే.. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ పెద్దలు.. వాటాలు ఇవ్వబోమన్న ఐటీ పరిశ్రమలను ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Nov 22 , 2024 | 10:02 PM