ఈడీ నోటీసులపై కవిత కీలక నిర్ణయం
ABN, Publish Date - Jan 16 , 2024 | 11:41 AM
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపింది.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపింది. దీంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ ఠాపిక్‌గా మారాయి. ఈడీ నోటీసులపై కవిత స్పందించారు. ఈ రోజు విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి లేఖ రాశారు. తనకు సుప్రీం కోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు ఉన్నాయని, కేసు పెండింగ్‌లో ఉంది కాబట్టి తాను నేటి విచానణకు రాలేనని లేఖలో స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Jan 16 , 2024 | 11:44 AM