ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దక్షిణ, కోస్తా జిల్లాలో భారీ వర్ష సూచనలు

ABN, Publish Date - Nov 25 , 2024 | 09:29 PM

నైరుతి బంగాళఖాతంలో అల్ప పీడనం ఏర్పడినట్లు విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్ప పీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుందని తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందంది.

నైరుతి బంగాళఖాతంలో అల్ప పీడనం ఏర్పడినట్లు విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్ప పీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుందని తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందంది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశముందని.. ఈ నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. అయితే ఈ వాయుగుండం వాయువ్య దిశలో పయనించి.. తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అదికారులు వెల్లడించారు.


తదుపరి రెండు రోజు.. ఇది వాయువ్య దిశలోనే పయనించి.. శ్రీలంక, తమిళనాడు వైపు కదులుతుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతానికి తొలి రెండు రోజులు.. అక్కడక్కడ తెలిక పాటి వర్షాలు పడే అవకాశముంది. మూడో రోజు అనగా నవంబర్ 27వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని పలు చోట్లు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 25 , 2024 | 09:30 PM