ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గంటన్నరపాటు ఆగిపోయి.. మళ్లీ కొట్టుకున్న గుండె..

ABN, Publish Date - Nov 20 , 2024 | 10:56 AM

ఇది నిజంగా మిరాకిల్ వైద్య శాస్తంలోనే అద్భుతం.. ఎవరైనా గుండె ఆగిపోతే చనిపోయారని నిర్దారిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో 30 ఏళ్ల యువకులకే హార్ ఎటాక్ వచ్చి చనిపోతున్నారు. తాజాగా ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది. ఆర్మీలో పని చేస్తున్న యువకుడికి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. వైద్యుల కృషితో 90 నిముషాల తర్వాత మళ్లీ గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. దీంతో ఆ సైనికుడు మళ్లీ బ్రతికాడు.

ABN Internet: గుండె కొట్టుకోవడం ఆగిపోతే ప్రాణం పోయినట్లే. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు కొద్ది క్షణాలపాటు ఇది జరుగుతుంది. అప్పుడు వెంటనే సీపీఆర్ చేస్తే మళ్లీ గుండె పనిచేస్తుంది. కానీ తాజాగా ఓ సైనికుడి గుండె 90 నిముషాలపాటు ఆగిపోయి మళ్లీ కొట్టుకుంది. వైద్యులు చేసిన కృషితోనే ఆ జావాన్ మళ్లీ ప్రాణం పోసుకున్నాడు. ఆధునిక వైద్య శాస్త్రంలో ఇదొక అద్భుతమని నిపుణులు అంటున్నారు. ఈ ఘటన ఒడిషా రాజధాని భువనేశ్వర్ ఎయిమ్స్‌లో జరిగింది.


వివరాల్లోకి వెళ్తే.. శుభాకాంత్‌ సాహు (24) అనే యువకుడు ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతను అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో చికిత్స కోసం అధికారులు అక్టోబరు 1న భువనేశ్వర్‌‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో చేరిన వెంటనే కార్డియాక్ అరెస్ట్‌కు గురై జవాన్ గుండె ఆగిపోయింది. దీంతో అతడికి 40 నిమిషాల పాటు సంప్రదాయ సీపీఆర్‌ను వైద్యులు నిర్వహించారు. అయినా ఎలాంటి మార్పు రాలేదు. ఆ తర్వాత ప్రత్యేకమైన ఎక్స్‌ట్రాకార్పోరియల్‌ కార్డియో-పల్మనరీ రిసస్కిటేషన్‌ (ఈసీపీఆర్‌) ప్రయోగించాలని వైద్య బృందం నిర్ణయించింది. ఎక్మో కూడా నిర్వహించారు. ఆ తర్వాత 96 గంటలకు గుండె పని తీరు మెరుగుపడి కోలుకున్నాడు.

డాక్టర్‌ శ్రీకాంత్‌ బెహరా నేతృత్వంలోని వైద్యుల బృందం ఎక్మోతో చికిత్స ప్రారంభించారు. అలా గంటన్నర పాటు చికిత్స అందించారు. తర్వాత గుండె తిరిగి కొట్టుకోవడం మొదలైంది. కానీ మొదట్లో గుండె కొట్టుకునే లయ సక్రమంగా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న వైద్య నిపుణులు ఎక్మోను కొనసాగించారు. 30 గంటల తర్వాత గుండె పనితీరు గణనీయంగా మెరుగుపడింది. చివరకు 96 గంటల తర్వాత ఎక్మోను తొలగించారు. గుండె ఎప్పటిలాగే పని చేసింది. ప్రస్తుతం ఆ సైనికుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని, స్పృహలో ఉన్నాడని వైద్యులు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రష్యా-ఉక్రెయిన్ వార్‌లో కీలక పరిణామం

వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి..

పోలవరం గేమ్‌ చేంజర్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 20 , 2024 | 10:57 AM