ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణ

ABN, Publish Date - Nov 20 , 2024 | 10:17 PM

దాచేపల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల ర్యాలీలో చెలరేగిన వివాదం రచ్చరచ్చగా మారింది. వేడుకల సందర్భంగా ముస్లిం వర్గానికి చెందిన కొంతమంది యువకులు భారీ శబ్దాలతో డీజేలు పెట్టి హంగామా సృష్టించారు.

పల్నాడు: దాచేపల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల ర్యాలీలో చెలరేగిన వివాదం రచ్చరచ్చగా మారింది. వేడుకల సందర్భంగా ముస్లిం వర్గానికి చెందిన కొంతమంది యువకులు భారీ శబ్దాలతో డీజేలు పెట్టి హంగామా సృష్టించారు. అలాగే కత్తులతో డీజేల వద్ద డాన్సులు చేశారు. అయితే ఇదంతా హిందువులు ఎక్కువగా ప్రాంతంలో జరిగింది. దీంతో తమను రెచ్చగొట్టేలా ముస్లిం యువకులు ప్రవర్తిస్తున్నారని హిందూ వర్గానికి చెందిన కొంత మంది యువత వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలనూ శాంతింపజేశారు. అలాగే కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ర్యాలీ ప్రశాంతంగా సాగేలా చర్యలు చేపట్టారు.

Updated Date - Nov 20 , 2024 | 10:17 PM